ఒకప్పుడు మెకానిక్.. ఇప్పుడు ఆస్తుల విలువ రూ.4800 కోట్లు.. జార్జ్ సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!

ఒక సాధారణ మెకానిక్ రూ.4800 కోట్ల ఆస్తిని సంపాదించడం అంటే చిన్న విషయం కాదనే సంగతి తెలిసిందే.కష్టంతో వచ్చిన కసితో జార్జ్ వి నేరేపరంబిల్ ( George V Nereparambil )కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించారు.మనిషి తలచుకుంటే ఏదైనా సాధించవచ్చని ఆయన ప్రూవ్ చేశారు.

 George V Nereaparmbil Inspirational Success Story Details Here Goes Viral , Geo-TeluguStop.com

ఎంతోమందికి స్పూర్తిగా నిలిచిన జార్జ్ వి నేరేపరంబిల్ సక్సెస్ స్టోరీ ఎంతగానో ఆకట్టుకునేలా ఉండటం గమనార్హం.

సాధారణ కుటుంబంలో జన్మించిన జార్జ్ 11 సంవత్సరాల వయస్సులోనే తన తండ్రికి వాణిజ్య పంటల బిజినెస్( Commercial crops business ) లో సహాయం చేశారు.

తక్కువ కాలంలోనే జార్జ్ బిజినెస్ కు సంబంధించి కూడా మెలుకువలు నేర్చుకున్నారు.కొంతకాలం పాటు మెకానిక్ గా పని చేసిన జార్జ్ 1976 సంవత్సరంలో షార్జాకు వెళ్లగా అక్కడ జార్జ్ జీవితం మలుపు తిరిగింది.

ఆ ప్రాంతం ఎడారి ప్రాంతం కావడంతో జార్జ్ ఎయిర్ కండీషనింగ్ రంగంపై దృష్టి పెట్టారు.

Telugu Luxury, Geo, Georgeburj-Inspirational Storys

జీఈవో గ్రూప్ ఆఫ్ కంపెనీస్( GEO Group of Companies ) ను స్థాపించి అంచలంచెలుగా ఎదిగారు.గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ భారతీయ వ్యాపార దిగ్గజాలలో జార్జ్ వి నేరేపరంబిల్ ఒకరు కాగా బుర్జ్ ఖలీపాలో ఇతని పేరుపై ప్రస్తుతం 22 లగ్జరీ అపార్టుమెంట్లు ఉన్నాయి.2010 సంవత్సరంలో జార్జ్ బుర్జ్ ఖలీపాలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకున్నాడు.ఎంతో కష్టపడటం ద్వారా 22 అపార్టుమెంట్లను కొనుగోలు చేశాడు.

Telugu Luxury, Geo, Georgeburj-Inspirational Storys

ఒకప్పుడు మెకానిక్ గా పని చేసిన వ్యక్తి ఈ స్థాయికి చేరుకున్నాడంటే అది సాధారణ విషయం ఎంత మాత్రం కాదు.జార్జ్ వి నేరేపరంబిల్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.జార్జ్ సక్సెస్ స్టోరీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఈ తరంలో ఎంతోమందికి జార్జ్ వి నేరేపరంబిల్ స్పూర్తిగా నిలిచారు.కష్టపడితే ఏదో ఒకరోజు ఫలితం దక్కుతుందని జార్జ్ ప్రూవ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube