బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అధికారులు వేరే వ్యక్తులతో కుమ్మకై ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు.
ఒకేసారి ఏడుగురు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక ఫిర్యాదు పేర్కొవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
కరోనా లాక్ డౌన్ పీరియడ్ మార్చి-ఏప్రిల్ లో కొందరు కామాంధులు ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారన్నారు.ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
లాక్ డౌన్ లో తమ కుమార్తెపై కొందరు అత్యాచారం చేసినట్లు బాలిక తల్లి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది.బాలిక కూడా తన వాగ్మూలంలో ఇదే పేర్కొవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
విచారణలో ఓ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థకు చెందిన ముగ్గురు వ్యక్తులు, ఇద్దరు పోలీసులు, మరో ఇద్దరు వ్యక్తులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించారు.ఈ మేరకు ఆ నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ ఉమాశంకర్ దాస్ తెలిపారు.
వీరిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుని ఐపీసీ, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ కేసును మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించిన దర్యాప్తు విభాగానికి అప్పగించినట్లు డీసీపీ ఉమాశంకర్ పేర్కొన్నారు.