మాస్టర్ ప్లాన్ కు నాకు సంబంధం లేదు ఆ ఏరియాలో నాకు 13.14 ఎకరాల భూమి ఉన్న మాట వాస్తవమే 15 ఏళ్ల క్రితమే ఆ భూమి కొనుగోలు చేసి ఐదేళ్ల క్రితం రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఆ భూమిని అమ్మలేదు.అమ్మకానికి ప్రపోజల్ వచ్చినా అమ్మలేదు మాస్టర్ ప్లాన్ రోడ్డుకు నా భూమి చాలా దూరం ఉంటుంది మాస్టర్ ప్లాన్ విషయంలో ముందుగా స్పందించి కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇబ్రహీంపట్నంలో ఇలాగే భూమి సేకరించి ఒక్కొక్క రైతుకు 5 లక్షలిచ్చి 12 కోట్లకు అమ్ముకున్నారు.కోకాపేటలో ఎకరం 60 కోట్లకు అమ్ముకున్నారు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతులు నన్ను కలిస్తే స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ కుమార్ ఐఏఎస్ తో మాట్లాడిన నా పర్సనల్ సెక్రెటరీ ద్వారా వినతిపత్రం కూడా పంపించాను.
రేపు సాయంత్రం లోపు మాస్టర్ ప్లాన్ విషయంలో స్పష్టత వస్తుంది బీజేపీ నేత వెంకట రమణారెడ్డి ఆరోపణలు అర్ధరహితం ఆయనది కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ.కాంగ్రెస్ పార్టీలో పని చేసిన వ్యక్తి ఆయన రమణారెడ్డికి నా చేతుల మీదుగా నాలుగు సార్లు బి ఫార్మ్ ఇచ్చిన ఎమ్మెల్సీగా పోటీ చేస్తా అంటే నేను వద్దని చెప్పిన పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఎమ్మెల్సీగా బి ఫార్మ్ ఇచ్చాం కాంగ్రెస్ పార్టీ మీటింగులో ప్రాణం పోయినా తప్పు చేయనని చెప్పి నామినేషన్ రోజు సింగిల్ గా వెళ్లి విత్ డ్రా చేసుకున్నాడు నమ్మకంతో పార్టీ టికెట్ ఇస్తే అమ్ముడుపోయాడు.
కోట్లకు అమ్ముడు పోయాడని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి ఎందుకు విత్ డ్రా అయ్యవని అడిగితే ఈటల రాజేందర్ ఫోన్ తో కేసీఆర్ ఫోన్ చేసి బెదిరించారని చెప్పాడు షబ్బీర్ ఆలీకి 2 కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నా అని ప్రచారం చేశారు మీడియా సమావేశంలో ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందని అడిగితే మధ్యలోనే వెళ్ళిపోయాడు మళ్ళీ కొన్ని రోజులకు వచ్చి కాంగ్రెస్ లో చేరతానంటే క్యారెక్టర్ బాగాలేదని నేను చేర్చుకోనని చెప్పిన అలాంటి వ్యక్తి ఈ రోజు నాకు 100 ఎకరాలు ఉందని బద్నాం చేస్తున్నారు కామారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎవరి వద్ద ఒక్క రూపాయి ఆశించలేదు మొన్నటిదాకా మూడు నెలల పాటు అబ్దుల్లా నగర్ శివారుపై మాట్లాడాడు.ఇప్పుడు అబ్దుల్లా నగర్ ఏమైంది.
సమస్య పరిష్కారం అయిందా.అక్కడి రైతులకు న్యాయం జరిగిందా.? ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు మాస్టర్ ప్లాన్ లో నా ఇల్లు కూడా పోతుంది గతంలో 40 ఫీట్లు ఉన్న రోడ్డు ఇప్పుడు 80 ఫీట్లు చేశారు.అందులో నా ఇల్లు 20 ఫీట్లు పోతుందిఅయినా రోడ్డు వెడల్పు అయితే మంచిదే కదా అధికారంలో ఉంటే బురద జల్లే ప్రయత్నం చేస్తే ఒక అర్థం ఉంటుంది.15 ఏళ్లుగా నేను అధికారంలో లేను.నాకు మాస్టర్ ప్లాన్ కు ఎలాంటి సంబంధం లేదు రైతులకు అండగా ఉంటా.
మాస్టర్ ప్లాన్ లో ఇండస్ట్రియల్ జోన్ పట్టణానికి దూరంగా చేయాలని కోరిన 100 ఫీట్ల రోడ్డు కాకుండా 60 ఫీట్లు పెట్టాలని సూచించిన నాపై అనవసర దుష్ప్రచారం చేస్తున్నారు రాజకీయాల్లో ఆరోగ్యకరమైన విమర్శలు ఉండాలి.ఇలాంటివి కాదు ఇన్నేళ్లు రమణారెడ్డి తండ్రి రాజిరెడ్డి నా గురువు అనే కారణంతో మాట్లాడలేదు ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తోంది ప్రజలు గమనించాలి
.