ఇటీవలే కాలంలో నకిలీ స్మార్ట్ ఫోన్ల దందా విపరీతంగా పెరిగింది.ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్ లోనే కాకుండా ఆన్లైన్లో కూడా నకిలీ ఫోన్లు విచ్చలివిడిగా అమ్ముడవుతూ, కొనుగోలుదారులు స్మార్ట్ ఫోన్లు ఒరిజినలో.
నకలీవో తెలియక సతమతమవుతున్నారు.తాజాగా నోయిడా లో తక్కువ ధరలకు విక్రయిస్తున్న ఐఫోన్ల ముఠాను పోలీసులు అరెస్టు చేయడంతో ఎన్నో నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఒక వ్యక్తి ఢిల్లీలో రూ.12 వేలకు ఒక ఫోన్ కొనుగోలు చేసి, షాపింగ్ వెబ్సైట్లో ఐఫోన్ ను పోలిన బాక్స్ ఆర్డర్ చేసి దానిపై ఆపిల్ స్టిక్కర్ అతికించి అమ్మేశాడాని పోలీసులు తెలిపారు.కాబట్టి స్మార్ట్ ఫోన్ ఒరిజనలో .నకిలీదో ఇలా చేస్తే తెలుస్తుంది.
ఒరిజినల్ స్మార్ట్ ఫోన్లు అన్ని IMEI నెంబర్ కలిగి ఉంటాయి.ఈ IMEI నెంబర్ ఫోన్ బాక్స్ పై, స్మార్ట్ ఫోన్ సెట్టింగ్ విభాగంలో ఉంటుంది.అంతేకాకుండా *#06#’ కు డయల్ చేసి 15 అంకెల IMEI నెంబర్ తెలుసుకోవచ్చు.ఏ మోడల్ స్మార్ట్ ఫోన్ నుంచైనా ఈ నెంబర్ కు డయల్ చేస్తే IMEI నెంబర్ తెలుసుకోవచ్చు.
ఒకవేళ అన్ని ప్రయత్నాలు చేసినా కూడా IMEI నెంబర్ కనిపించకపోతే అది నకిలీ ఫోన్ అవుతుంది.
ఒకవేళ ఎలా తెలుసుకోవాలో అర్థం కాకపోతే దగ్గర్లో ఉండే మొబైల్ స్టోర్ ని సందర్శించి, IMEI నెంబర్ సెర్చ్ చేస్తే స్మార్ట్ ఫోన్ నిజమైనదైనా, నకిలీదా అనేది బయటపడుతుంది.స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకునేవారు, IMEI నెంబర్ పట్ల దృష్టి పెట్టుకుని, తక్కువ ధర కోసం మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి.
ఆఫర్ల కోసం వేచి ఉండే కొనుగోలుదారులను టార్గెట్ చేసుకొని, తక్కువ ధర అని ఆశ చూపించి నకిలీ స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టి మోసం చేసే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.
కాబట్టి స్మార్ట్ ఫోన్ కొనే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి.