సాధారణంగా మనం చూస్తూ ఉంటాం… ఈ కామర్స్ సంస్థలు అనేవి పండగలు – పబ్బాలు సమయంలో బాగా డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తూ జనాలను బాగా ఆకర్షిస్తాయి.ఈ క్రమంలోనే ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.
కొనుగోలుదారులకు శుభవార్త చెబుతూ.హోలీని పురస్కరించుకుని బిగ్ బచత్ సేల్ పేరుతో ఓ ప్రత్యేక సేల్ ని ప్రకటించింది.
ఆల్రెడీ మొదలైన ఈ సేల్ ఈ నెల 5వ తేదీ వరకు కొనసాగనుంది.ఈ ప్రత్యేక సేల్‌లో 1000కి పైగా కంపెనీలకు చెందిన లక్షప్రొడక్ట్‌లపై 80 శాతం డిస్కౌంట్ ఉంటుందని ఈ కామర్స్ దిగ్గజం ప్రకటించడం విశేషం.
అవును, మొబైల్స్, ల్యాప్ ట్యాప్స్, ట్యాబ్లెట్స్, దుస్తులు, టీవీలుపై ఆకట్టుకునే స్థాయిలో ఆఫర్లు తీసుకొచ్చింది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ 2023 హోలీ పండుగ సందర్భంగా ప్రారంభించారు.పలు నివేదికల ప్రకారం.ప్లిప్‌కార్ట్ బిగ్ బచత్ సేల్‌లో ల్యాప్‌ట్యాప్స్‌పై 45 శాతం డిస్కౌంట్ అందిస్తుండగా.
యాపిల్, శాంసంగ్, పోకో, రియల్ మీ వంటి ఫోన్‌లపై డిస్కౌంట్‌లు ఉంటాయని వెల్లడించింది.కాబట్టి ఆయా వస్తువులు కొనుగోలు చేసేవారు త్వరగా మేలుకుంటే ఉత్తమం.
వీటితో పాటు ఫర్నిచర్, పరుపులు, షూ రాక్‌లు, పోర్టబుల్ ల్యాప్‌టాప్ స్టాండ్‌లపై భారీ తగ్గింపులను అందిస్తుందని తెలుస్తోంది.
ఇక, ఇంతకుమునుపు అత్యధికంగా అమ్ముడైన ల్యాప్‌టాప్‌లను 45 శాతం వరకు తగ్గింపు ధరతో మీకు ఈ సేల్ పుణ్యమాని కొనుగోలు చేయవచ్చు.ఆపిల్, సామ్ సంగ్, పోకో మరియు రియల్ మి నుండి స్మార్ట్‌ఫోన్‌లు కూడా మంచి తగ్గింపు ధరతో లభిస్తాయి.ఇతర కేటగిరీలలో బొమ్మలు, సౌందర్య ఉత్పత్తులు మరియు క్రీడా వస్తువులు కూడా ఉన్నాయి.
అలాగే గృహాలంకరణ మరియు గృహోపకరణాలు, వంటగది ఉపకరణాలు మరియు ఇతర గృహోపకరణాలు కూడా ప్రచార ఆఫర్‌లను కలిగి ఉంటాయి.కాబట్టి త్వరపడండి!
.