అవును, రవి అస్తమించని సామ్రాజ్యానికి గ్రహణం పట్టింది.బ్రిటన్ దేశ ప్రజలు నేడు ఆకలితో అలమటిస్తున్నారు.
ఆ దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకీ పతనమైపోతోంది.దాంతో అక్కడ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
పెరుగుతున్న ధరలకి తగ్గట్టుగా ఆదాయ మార్గాలు కూడా సన్నగిల్లడంతో ప్రజలకి కొనుక్కొని తినే స్థోమత కూడా కరువు సంభవించింది.దీంతో సమాజంలోని వివిధ వర్గాలు వేతనాల పెంపు డిమాండ్‌తో సమ్మెకు దిగుతున్నాయి.
ప్రపంచంలోని మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలు ఈ ఏడాది ఆర్థికంగా పుంజుకుంటే బ్రిటన్ మరింత క్షీణిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేయడం కొసమెరుపు.
ఇంకో నెల రోజుల పైనే ఈ సంక్షోభం తప్పదని అక్కడి నివేదికలు చెబుతున్నాయి.ఈలోగా రిషి సునాక్ దేశంలో అదుపు తప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టకపోతే.పరిస్థితులు విషమిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వాలు మారినా.తమకీ గడ్డు పరిస్థితులేంటని జనం నిలదీస్తున్నారు.
ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన బ్రిటన్ నేడు ఆకలి కేకలు పెట్టడం గమనార్హం.రవి అస్తమించని సామ్రాజ్యంలో టమోటా కూడా దొరకడం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ క్రమంలో అక్కడ సూపర్ మర్కెట్స్, ఫ్రూట్ మర్కెట్స్ అన్నీ బోసిపోతున్నాయి.అతిపెద్ద సూపర్ మార్కెట్‌లో కూడా 2 ఆలుగడ్డల కంటే ఎక్కువ కొనలేని పరిస్థితి ఉంది.ఎందుకంటే ఎక్కువ వుండవు సరికదా, అంతకంటే ఎక్కువ కొనకూడదని రూల్స్ పాస్ చేసారు.అంత దారుణంగా అక్కడ నిత్యావసర వస్తువుల కొరత అనేది ఏర్పడింది.ఓడలు బండ్లవడం, బళ్ళు ఓడలవ్వడం అంటే ఇదేనేమో.ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన బ్రిటిష్ సామ్రాజ్యం నేడు చాలా దయనీయమైన స్థితిలో ఉండడం కొసమెరుపు.
సింపుల్‌గా చెప్పాలంటే, పాకిస్థాన్ బాటలోనే బ్రిటన్ కూడా పయనిస్తోంది.