హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిఖిల్ సిద్దార్థ్ తన టాలెంట్ తో వరస హిట్లు కొట్టి మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిలదొక్కుకున్నాడు.లాక్ డౌన్ లో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యిన నిఖిల్ ఒక్క సూపర్ హిట్ తో తన కెరీర్ ను కూడా గాడిలో పెట్టుకోవాలని చూస్తున్నాడు.
ప్రెసెంట్ నిఖిల్ నటిస్తున్న సినిమాల్లో ‘18 పేజెస్’ ఒకటి.ఈ సినిమాను కుమారి 21F సినిమా ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి తెరకెక్కిస్తున్నాడు.అయితే ఈ సినిమా కథను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ రాయడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది.
అలాగే నిఖిల్ కార్తికేయ 2 సినిమా కూడా చేస్తున్నాడు.ఈయన కెరీర్ లో కార్తికేయ సినిమా ఎంత హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 చేస్తున్నాడు.చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిఖిల్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో సూపర్ హిట్ అయ్యింది.
ఇక ఇప్పుడు చేస్తున్న కార్తికేయ 2 ఎలాంటి సస్పెన్స్ క్రియేట్ చేయనుంది అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
ఈ రోజు ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్.మోషన్ పోస్టర్ విడుదల అవ్వగా ఈసారి ఏకంగా సముద్రం పైనే తమ ప్రయాణాన్ని మొదలు పెట్టారు.భారీ ఉరుములతో, మెరుపులతో పక్షుల అరుపులతో సముద్రం మీద ప్రయాణం చేస్తున్న భయానకమైన దృశ్యాలతో ఈ వీడియో వదిలారు.ఈ వీడియోలో నిఖిల్ తో పాటు హీరోయిన్ అనుపమ, జ్యోతిష్యుడు గా శ్రీనివాసరెడ్డు కనిపించారు.
”సముద్రం దాచుకున్న అతిపెద్ద ప్రపంచ రహస్యం ఈ ద్వారకా నగరం అంటూ చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకుంది.ఒక్క డైలాగ్ తోనే ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది.ఈ సినిమా స్టోరీ శ్రీకృష్ణుడికి సంబదించినదిగా అనిపిస్తుంది.ఇక ఈ సినిమా జులై 22న రిలీజ్ చేయబోతున్నారు.పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పథకాలపై ఈ సినిమా నిర్మిస్తున్నారు.