కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కామాంధుడిలా మారిపోయాడు.ఇంట్లో ఎవరూ లేరని అదునుగా భావించి గొడ్డలితో నరుకుతానని బెదిరించి మరీ లొంగదీసుకుని ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ దుర్మార్గుడు తన పదమూడేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు.జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని అనడంతో భయంతో అలానే ఉండిపోయింది ఆ మైనర్ బాలిక.
కన్న కూతురిపై అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది.పూణేలోని అలండి ఏరియాకి చెందిన ఓ వ్యక్తి (38) తన భార్య, కొడుకు, కూతురుతో కలిసి నివాసముంటున్నాడు.
కామంతో కళ్లు మూసుపోయి కన్న కూతురిపై దారుణానికి పాల్పడ్డాడు.గొడ్డలితో భయపెట్టి దగ్గరికి తీసుకుని అత్యాచారానికి ఒడిగట్టాడు.విషయం ఎవరికైనా చెబితే నరికేస్తానని బెదిరించడంతో ఆ బాలిక నోరు తెరవలేదు.దీంతో రెచ్చిపోయిన తండ్రి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు.
కన్నతండ్రి దాష్టీకాన్ని భరించలేక బాలిక తల్లికి జరిగిన విషయం తెలిపింది.దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
బాలికను ఎక్కడ చంపేస్తాడేమోననే భయంతో ఆ దుర్మార్గుడు లేని సమయంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.