క్యాన్సర్ అనేది ఒక ప్రాణాంతక వ్యాధి అని తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది క్యాన్సర్( Cancer ) బారిన పడి మరణిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో క్యాన్సర్ వ్యాధికి మంచి ట్రీట్మెంట్స్ లభిస్తున్నాయి.అయితే ఒక వ్యక్తి కాస్త అనారోగ్యం బారిన పడి తనకు క్యాన్సర్ వచ్చిందేమో అని భయపడ్డాడు.
తాను క్యాన్సర్ వ్యాధి వల్ల చనిపోతే తన కుమారుడు ఒంటరివాడై ఎలా జీవిస్తాడని మరింత భయపడ్డాడు.దీంతో తాను చనిపోక ముందే తన కొడుకును హత్య చేయాలని నిర్ణయించుకుని హత్య చేసిన ఘటన మహారాష్ట్రలోని( Maharashtra ) సతారా జిల్లా హివ్రే గ్రామంలో చోటుచేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.హివ్రే గ్రామానికి( Hivre village ) చెందిన 45 ఏళ్ల వ్యక్తి ఇటీవలే అనారోగ్యానికి గురై, కాస్త బలహీనంగా మారాడు.తనకు క్యాన్సర్ ఉందేమో అనే భ్రమలో, తాను చనిపోతే తన 12 ఏళ్ల కుమారుడిని( 12 Years Son ) ఎవరు చూసుకుంటారని ఆందోళన చెందాడు.
రోజురోజుకు ఆలోచిస్తూ చాలా కుమిలిపోయాడు.తాను చనిపోవడం కంటే ముందే తన కొడుకులు చంపేస్తే బాగుంటుంది అనిపించింది.ఆ తర్వాత కొడుకును కట్టేసి తాడుతో గొంతు కోసి హత్య చేశాడు.కుమారుడి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా తన పొలంలోనే పూడ్చి పెట్టాడు.
అయితే చిన్నపిల్లాడు కనిపించకపోవడం, హత్య చేసిన తండ్రి( Father ) ప్రవర్తనలో మార్పు కనిపించడంతో చుట్టుపక్కల ఉండే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు( Police ) కేసు నమోదు చేసుకుని ఆ వ్యక్తిని విచారించగా తానే తన కుమారుడిని చంపినట్లు అంగీకరించాడు.పోలీసులు బాలుడి మృత దేహాన్ని తవ్వి తీసి పోస్ట్మార్టం నిర్వహించారు.ఆ తర్వాత ఆ వ్యక్తికి పోలీసులు వైద్య పరీక్షలు చేయించగా అసలు ఆ వ్యక్తికి క్యాన్సర్ వ్యాధి లేదు.
అనారోగ్యం కారణంగా బలహీన పడడంతో తనకు క్యాన్సర్ ఉందని భ్రమపడ్డాడు.దీంతో ఆందోళనకు లోనై తానేం చేస్తున్నాడో మైమరచి కన్న కొడుకుని చంపుకున్నాడు.అసలు విషయం తెలియడంతో మరింత కుమిలిపోతున్నాడు.