అశ్వగంధ సాగు చేసి చరిత్ర సృష్టించిన‌ రైతు

మ‌హారాష్ట్ర‌లోని విదర్భలో చాలా మంది రైతులు తమ పొలాల్లో పత్తి, సోయాబీన్ పంట‌ను పండించడం కనిపిస్తుంది.అయితే ఇటువంటి ప‌రిస్థితుల‌ మధ్య వాషిమ్ జిల్లాలోని కరంజి గ్రామానికి చెందిన రైతు అమోల్ బయాస్ తన పొలంలో అశ్వగంధ పంటను వేశాడు.

 Farmers Started Cultivation Of Ashwagandha ,farmers , Cultivation , Ashwagandha,-TeluguStop.com

తన జిల్లాలో ఈ ర‌క‌మైన సాగు చేసిన మొదటి రైతు ఇత‌నే.ఈ విధంగా ఆయన చరిత్ర సృష్టించారు.

అశ్వగంధ పంటను అడవి జంతువులు తినవని రైతు అమోల్ బయాస్ చెప్పారు.ప్రస్తుతం ఎకరంలో 30వేలు వెచ్చించి అశ్వగంధ పంట వేశాడు.

దీని ఆకులు, వేర్లు అన్నీ ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.అటువంటి పరిస్థితిలో, రైతులు సులభంగా ఈ ప్లాంట్ నుండి రెట్టింపు లాభం పొందవచ్చు.

ఆయన మాట్లాడుతూ గతంలో తాను సంప్రదాయ వ్యవసాయం చేసేవాడిన‌ని, అశ్వగంధ సాగు గురించి సోషల్ మీడియాలో సమాచారం తెలుసుకున్న‌ తర్వాత ఒక‌ ఎకరంలో అశ్వగంధ పంట వేయాలని అనుకున్నాను.ఆయుర్వేద లక్షణాల వల్ల జంతువులు ఈ పంటను అస్సలు పాడుచేయవు.4 నెలల్లో మొత్తం పంట చేతికి వస్తుందని తెలిపారు. అమోల్ బయాస్ తెలిపిన వివ‌రాల ప్రకారం అతను 30 వేల రూపాయలు ఖర్చు చేసి, 70 వేల రూపాయల లాభం అందుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube