ఏలూరు జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.గుడివాడ లంకలో ఓ కుటుంబం గ్రామ బహిష్కరణ కు గురి అయింది.
చెరువు లీజుకి సంబంధించిన డబ్బులు కట్టలేదని కుటుంబాన్ని బహిష్కరించినట్లు సమాచారం, కుటుంబ సభ్యులను వెలివేసి గ్రామ పెద్దలు ఇంటిని అమ్మేశారు.దీంతో బాధేత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
బాధ్యతలు ఫిర్యాదులోకి రంగంలోకి దిగిన ఏలూరు రూరల్ పోలీసులు గ్రామ పెద్దలను స్టేషన్ కు పిలిపించారు.అయితే కేసు వెనక్కి తీసుకోవాలని తమ కుటుంబం పై గ్రామస్తులు ఒత్తిడి తీస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.