వ్యతిరేక రివ్యూలు ఇచ్చిన ఫేస్‌బుక్ అడ్మిన్లు.. కోర్టుకెళ్లిన అమెజాన్

ప్రస్తుతం చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌కు అలవాటు పడ్డారు.ఏదైనా వస్తువు కొనాలంటే చకచకా ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పెట్టేస్తున్నారు.

 Facebook Admins Who Gave Negative Reviews Amazon Went To Court , Facebook , Revi-TeluguStop.com

ఈ క్రమంలో ఆ వస్తువులను కొనే ముందు కస్టమర్ల రివ్యూలు చదువుతున్నారు.అందులో ఎవరైనా ఆ ప్రొడక్ట్ గురించి బాగోలేదంటే ఒక్క క్షణం ఆలోచిస్తారు.

ఆ ప్రొడక్ట్‌ను వదిలేసి, వేరు ప్రొడక్ట్‌ను కొంటారు.అయితే కొందరు పెట్టే నకిలీ రివ్యూలతో అమెజాన్‌కు భారీ నష్టం వాటిల్లింది.

ఇలా ఎందుకు జరిగిందనే కారణంగా ఆరా తీసిన అమెజాన్‌కు షాకింగ్ విషయాలు తెలిశాయి.కొందరు నకిలీ ఫేస్ బుక్ పేజీలు సృష్టించి, వాటి ద్వారా తప్పుడు రివ్యూలు పెట్టినట్లు తేలింది.

దీంతో అమెజాన్ సంస్థ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.తమకు జరిగిన నష్టంపై కోర్టులో పిటిషన్ వేసింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

నకిలీ రివ్యూలతో సమస్య ఎదురవడంతో 10 వేల కంటే ఎక్కువ ఫేస్ బుక్ పేజీల అడ్మిన్లపై అమెజాన్ కోర్టుకెళ్లింది.

సోమవారం కోర్టులో వారిపై దావా వేసింది.గ్లోబల్ గ్రూప్‌లు, నకిలీ రివ్యూయర్‌లను నియమించుకుని ఇలా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

ఆ ఫేస్ బుక్ నకిలీ రివ్యూలు అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, జపాన్ మరియు ఇటలీలో అమెజాన్ ఆన్‌లైన్ స్టోర్ ఫ్రంట్‌లలో నిర్వహించబడుతున్నాయి.నకిలీ ఫేస్ బుక్ అడ్మిన్లు 2015 నుండి తమ సంస్థలోని ప్రొడక్టులపై నకిలీ రివ్యూలు ఇస్తున్నారని పేర్కొంది.2022లో ఫేస్ బుక్ ఓ నకిలీ గ్రూపును తొలగించింది.దానికి 40 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

దానిని నిర్వహించిన వారు దానికి “Amazon Product Review” అని పేరు పెట్టారు.అంటే అమెజాన్ సంస్థే తమ వస్తువులపై రివ్యూ ఇచ్చినట్లు కస్టమర్లను నమ్మించింది.

ఇలాంటి వాటిపై పర్యవేక్షణ నిరంతరంగా పెడతామని, అయితే వేలకొద్దీ చట్టవిరుద్ధమైన నకిలీ సమీక్షలు ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నాయని అమెజాన్ వాపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube