మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ కోర్టు విచారణ జరిపింది.ఈ క్రమంలో హత్య కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు న్యాయస్థానం ఎదుట హాజరైయ్యారు.
ఈ మేరకు ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డితో పాటు సునీల్ యాదవ్, శివ శంకర్ రెడ్డి, ఉమాశంకర్, దస్తగిరిలు ధర్మాసనం ఎదుట హాజరైయ్యారు.ఈ నేపథ్యంలో తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఈనెల 31కి వాయిదా వేసింది.
మరోవైపు ఈ కేసులో భాగంగానే కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు మూడోసారి విచారిస్తున్న సంగతి తెలిసిందే.