సంచార జాతులకు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో 10 శాతం రాజ్యాంగ బద్ధమైన రిజర్వేషన్ల సాధనకై హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించారు.ముఖ్యఅతిథిగా బిజెపి పార్టీ సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.
ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సంచార జాతులను రాజ్యాంగబద్ధమైన కులాలను గుర్తించి విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని వారి కోరారు.తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతుల స్థితిగతుల అధ్యయనం చేసి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని వారు కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఒక సంవత్సరం కాలంలో సంచార జాతుల సర్వేను ఆయా కుల సంఘాల వారితో చేయించి గ్రామ మండల జిల్లా స్థాయి నివేదికలు రూపొందించాలని వారు కోరారు.నగరాలు పట్టణాలలో ప్రతి లక్ష మంది జనాభాకు ఒక షెల్టర్ జోన్ ఏర్పాటుచేసి సంచారజాతులు తత్వలికంగా నివాసము ఉండుటకు షెడ్లు మించి మౌలిక వసతులు కల్పించాలని వారు కోరారు.
ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎంబీసీ జాతుల వారికి ఇవ్వాలని, ఫెడరేషన్ సంచార కులాలను ఎం బిసీలో చేర్చాలని వారి కోరారు.తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతుల స్థితిగతులను అధ్యయనం చేయుటకు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని వారు కోరారు.