పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ పురోగతికి చేరుకుంది..: నిర్మలా సీతారామన్

పాలనలో పారదర్శక విధానాలను పాటిస్తున్నామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గరీబ్ కల్యాణ్ దేశ్ కా కల్యాణ్( Garib Kalyan Desh Ka Kalyan ) అన్న ఆమె సుమారు 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని తెలిపారు.రూ.34 లక్షల కోట్లను నేరుగా నగదు బదిలీ ద్వారా పేదలకు అందించామని నిర్మలా సీతారామన్( Nirmala Sitharaman ) పేర్కొన్నారు.11.8 కోట్ల మంది రైతులకు నేరుగా నగదు సాయం అందిస్తున్నామన్నారు.నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్న ఆమె ఏడు ఐఐటీ, ఏడు ఐఐఎం మరియు 390 యూనివర్సిటీలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.యువత అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నామని తెలిపారు.

 Economic System Has Progressed In Ten Years..: Nirmala Sitharaman,nirmala Sithar-TeluguStop.com

2023లో చెస్ లో 80 మంది గ్రాండ్ మాస్టర్లు తయారయ్యారని చెప్పారు.అలాగే ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు రూ.30 వేల కోట్ల ముద్రా రుణాలు ఇచ్చామన్న నిర్మలా సీతారామన్ పీఎం ఆవాస్ యోజన( PM Awas Yojana ) కింద ఇచ్చిన ఇళ్లలో 70 శాతం మహిళలకే అని తెలిపారు.ద్రవ్యోల్బణం అదుపులో ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు.

ప్రజల ఆదాయం 50 శాతం వృద్ధి చెందిందన్నారు.పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ పురోగతికి చేరుకుందని పేర్కొన్నారు.

దేశంలోని అన్ని ప్రాంతాలు ఆర్థికాభివృద్ధిలో భాగం అయ్యాయని చెప్పారు.జీఎస్టీ( GST ) ద్వారా ఒక దేశం ఒక పన్ను విధానాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube