పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ పురోగతికి చేరుకుంది..: నిర్మలా సీతారామన్
TeluguStop.com
పాలనలో పారదర్శక విధానాలను పాటిస్తున్నామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
గరీబ్ కల్యాణ్ దేశ్ కా కల్యాణ్( Garib Kalyan Desh Ka Kalyan ) అన్న ఆమె సుమారు 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని తెలిపారు.
రూ.34 లక్షల కోట్లను నేరుగా నగదు బదిలీ ద్వారా పేదలకు అందించామని నిర్మలా సీతారామన్( Nirmala Sitharaman ) పేర్కొన్నారు.
11.8 కోట్ల మంది రైతులకు నేరుగా నగదు సాయం అందిస్తున్నామన్నారు.
నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్న ఆమె ఏడు ఐఐటీ, ఏడు ఐఐఎం మరియు 390 యూనివర్సిటీలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
యువత అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నామని తెలిపారు. """/"/
2023లో చెస్ లో 80 మంది గ్రాండ్ మాస్టర్లు తయారయ్యారని చెప్పారు.
అలాగే ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు రూ.30 వేల కోట్ల ముద్రా రుణాలు ఇచ్చామన్న నిర్మలా సీతారామన్ పీఎం ఆవాస్ యోజన( PM Awas Yojana ) కింద ఇచ్చిన ఇళ్లలో 70 శాతం మహిళలకే అని తెలిపారు.
ద్రవ్యోల్బణం అదుపులో ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు.ప్రజల ఆదాయం 50 శాతం వృద్ధి చెందిందన్నారు.
పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ పురోగతికి చేరుకుందని పేర్కొన్నారు.దేశంలోని అన్ని ప్రాంతాలు ఆర్థికాభివృద్ధిలో భాగం అయ్యాయని చెప్పారు.
జీఎస్టీ( GST ) ద్వారా ఒక దేశం ఒక పన్ను విధానాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు.
బన్నీ ఇంటికి వెళ్లిన సెలబ్రిటీలు ఆ మహిళ ఇంటికి వెళ్లగలరా.. నెటిజన్ల సూటిప్రశ్న వైరల్!