తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

లైఫ్ లో సక్సెస్ సాధించాలనే కోరిక, ఆకాంక్ష ప్రతి ఒక్కరికీ ఉంటుంది.సక్సెస్ కోరుకునే ప్రతి ఒక్కరికీ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.

 Dumpa Sravani Inspirational Success Story Details Here Goes Viral In Social Me-TeluguStop.com

సరైన మార్గంలో చదువుకోవడం ద్వారా మాత్రమే లక్ష్యాలను సాధించడం సాధ్యమవుతుంది.అలా పది, ఇంటర్ పరీక్షలలో మంచి మార్కులు సాధించిన వాళ్లలో దుంప శ్రావణి( dumpa sravani )ఒకరు.

ప్రాణాలను పణంగా పెట్టి కష్టపడుతున్న అమ్మానాన్నలకు అండగా నిలవాలని శ్రావణి భావిస్తున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని రహీంఖాన్ పేటకు ( Yadadri to Rahim Khan Petak )చెందిన శ్రావణి కుటుంబం కొంతకాలం క్రితం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తికి వలస వచ్చింది.

అమ్మ విజయ, నాన్న రవి మట్టి కార్మికులుగా పని చేస్తుండగా ఆ పనులు నిత్యం ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని చేసే పనులు కావడం గమనార్హం.శ్రావణి తల్లీదండ్రులు వ్యవసాయ బావుల తవ్వకాలు, పూడికతీత పనులు చేస్తుంటారు.

Telugu Dumpa Sravani, Dumpasravani, Yadadrirahim-Inspirational Storys

అయితే ఎంత కష్టపడినా వాళ్లకు వచ్చే ఆదాయం మాత్రం పరిమితంగానే ఉండేది.ముగ్గురు పిల్లల్లో శ్రావణి చివరి అమ్మాయి కాగా బాగా చదువుకుంటే మాత్రమే ఈ పరిస్థితులు మారతాయని ఆమె భావించారు.పదో తరగతిలో 9.5 జీపీఏ సాధించిన శ్రావణి ఇంటర్ బైపీసీలో 1000 మార్కులకు 973 మార్కులు సాధించారు.భవిష్యత్తులో వైద్య విద్య చదవాలని శ్రావణి భవిస్తుండటం గమనార్హం.

Telugu Dumpa Sravani, Dumpasravani, Yadadrirahim-Inspirational Storys

తరగతి గదిలో పాఠాలు శ్రద్ధగా వినడంతో పాటు నోట్స్ రాసుకుని రివిజన్ చేయడం వల్లే మంచి మార్కులు సాధించానని ఆమె చెబుతున్నారు.నీట్ పరీక్షలో సైతం మంచి మార్కులు సాధించి గవర్నమెంట్ డాక్టర్ అవుతానని శ్రావణి పేర్కొన్నారు.దుంప శ్రావణి చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

దుంప శ్రావణి డాక్టర్ కావాలన్న లక్ష్యాన్ని సాధించి ఎంతోమందికి స్పూర్తిగా నిలవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.శ్రావణి టాలెంట్ ను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube