నిన్ను ఎప్పుడైనా, ఎక్కడైనా చంపేస్తా : భారత సంతతి అధ్యక్ష అభ్యర్ధి వివేక్ రామస్వామికి బెదిరింపులు

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన భారత సంతతి అభ్యర్ధి వివేక్ రామస్వామిని( Vivek Ramaswamy ) చంపేస్తానంటూ ఓ వ్యక్తి బెదిరించడం కలకలం రేపుతోంది.ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పాల్గొనబోయే కార్యక్రమాల వివరాలను తెలియజేస్తూ ఓటర్లకు నోటిఫికేషన్ పంపించారు వివేక్.

 Dover Man Threatens To Kill Indian-american Presidential Candidate Vivek Ramaswa-TeluguStop.com

దీనికి ప్రజలు తమకు తోచినట్లుగా స్పందించారు.ఇందులో ఓ వ్యక్తి మాత్రం వివేక్‌ను చంపేస్తానంటూ బెదిరించాడు.

వచ్చే ఈవెంట్లు తనకు అనుకూలంగా వుంటాయని.ఆ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరినీ చంపేస్తానంటూ సదరు వ్యక్తి సందేశం పంపాడు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి న్యూహాంప్‌షైర్‌లోని డోవర్( Dover, New Hampshire ) నుంచి ఈ సందేశాలు వచ్చినట్లు గుర్తించారు.నిందితుడు టైలర్ అందర్సన్ (30)గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.ఇతని నేరం రుజువైతే ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 2.50 లక్షల జరిమానా పడే అవకాశం వుందని న్యాయ నిపుణులు అంటున్నారు.

Telugu America, Dover, Fbi Affidavit, Indian American, Hampshire, Attorneys, Viv

ఈ సందర్భంగా వివేక్ రామస్వామి స్పందించారు.తనకు వచ్చిన బెదిరింపు సందేశాలకు వేగంగా స్పందించి నిందితుడిని అరెస్ట్ చేసినందుకు పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఎఫ్‌బీఐ అఫిడవిట్ ప్రకారం( FBI affidavit ) .వివేక్ రామస్వామి శుక్రవారం పోర్ట్స్‌మౌత్‌లో జరగనున్న కార్యక్రమం గురించి ఓటర్లకు తెలియజేసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.అయితే అమెరికా అటార్నీ కార్యాలయం( US Attorney’s Office ) మాత్రం నిందితుడు ప్రస్తుతం బరిలో వున్న అభ్యర్ధుల్లో ఎవరినీ టార్గెట్ చేశాడన్నది చెప్పలేదు.అయితే రామస్వామి బృందం మాత్రం నిందితుడు ఆయననే టార్గెట్ చేశాడని నిర్ధారించినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.

వివేక్ క్యాంపెయినింగ్ ప్రతినిధి ట్రిసియా మెక్‌లాఫ్లిన్ కూడా దీనిని ధ్రువీకరించారు.

Telugu America, Dover, Fbi Affidavit, Indian American, Hampshire, Attorneys, Viv

ఈ ఘటనలో వేగంగా స్పందించిన లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ట్రిసియా కృతజ్ఞతలు తెలిపారు.అమెరికన్లందరి భద్రత గురించి తాము ప్రార్ధిస్తున్నామని ఆమె వెల్లడించారు.దర్యాప్తు ఏజెన్సీలు శనివారం అండర్సన్ నివాసంలో తనిఖీలు నిర్వహించి, అతనిని అదుపులోకి తీసుకుని అండర్సన్ ఫోన్, తుపాకీలను సీజ్ చేశారు.

అతని ఫోన్ తనిఖీ చేస్తున్నప్పుడు రామస్వామికి పంపిన సందేశాలను ఓ ఫోల్డర్‌లో కనుగొన్నారు.అలాగే మరో అధ్యక్ష అభ్యర్ధికి పంపేందుకు అండర్సన్ మరికొన్ని సందేశాలను సిద్ధం చేసుకున్నాడని ఎఫ్‌బీఐ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube