వాళ్ళని చూసి సింహాలకు టెర్రర్...ఇంతకీ వాళ్ళు ఎవరంటే..!

అడవికి రాజు ఎవరని చిన్నపిల్లాడిన అడిగిన టక్కున సింహం అని చెప్పేస్తాడు.సింహాన్ని చూస్తే ఎలాంటి జంతువు అయినా సరే బయపడక తప్పదు.

 Dorobo Tribe Of Kenya Can Frighten Lions And Steal Food From Lions Details, Lion-TeluguStop.com

అందుకే అడవికి రాజు అని సింహాన్ని అభివర్ణిస్తారు.మృగరాజు ఒక్కసారి గర్జిస్తే చాలు అడవిలో ఉన్న జంతువులకు భూకంపం వచ్చినట్లు అనిపిస్తుంది.

సింహాన్ని చూసి మనుషులు సైతం ఆమడ దూరం పారిపోతారు.మరి అలాంటిది సింహమే మనుషులను చూసి అడుగు వెనక్కి వేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.

సినిమాల్లో లాగా ఇది కల అనుకునేరు.కానీ ఇది నిజమే.

మనుషులను చూసి ఒక్క సింహం కాదు ఏకంగా ఒక ఐదు సింహాలు పారిపోయాయి.వాళ్ళని చూస్తే చాలు సింహాలు వణికిపోతాయి.

ఇంతకీ వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తున్నారా.? వాళ్ళని చూసి సింహాలు భయపడి పారిపోతున్నాయి అంటే వాళ్ళు చాలా బలమైన వాళ్ళు అని అనుకుంటే పొరపాటు పడినట్లే.ఎందుకంటే వాళ్ళేమి కండలు తిరిగిన శరీరం గల వాళ్ళు కాదు.చాలా సన్నగా ఉండడంతో పాటు చూడటానికి బలహీనంగా కూడా కనిపిస్తారు.మరి అలాంటి వాళ్లు సింహాలను ఎలా హడలేత్తించారు అని అనుకుంటున్నారా.?

వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని చుడాలిసిందే.ఈ వీడియోకు “సింహాల నుంచి మాంసాన్ని దొంగిలిస్తారు” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.ఈ వీడియోలో కనిపించే కొన్ని సింహాలు అడవిలో ఒక జంతువును వేటాడతాయి.

దాన్ని చంపి తింటూ ఉంటాయి.ఆ సమయంలో బక్కపలచగా ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆ సింహాల గుంపుకు కొంత దూరంలో కూర్చొని వాటిని చూస్తూ ఉంటారు.

సింహలు చనిపోయిన జంతువును తినే పనిలో ఉన్నాయి.

కొన్నిక్షణాల తర్వాత వాళ్లు ముగ్గురు నడుస్తూ సింహాల వైపు వెళ్తారు.వాళ్ళ దగ్గర తుపాకీలు లాంటివి అయితే ఏమి లేవుగాని బాణాలు మాత్రం ఉన్నాయి.వాళ్లు తమవైపు రావడం చూసిన సింహాలు తినడం ఆపేసి మరి తలో దిక్కుకు పారిపోయి తుప్పల్లో దాక్కుంటాయి.

ముగ్గురు వ్యక్తులు మాత్రం ఆ సింహాలను చూసి అసలు భయపడకుండా అడుగులు ముందుకు వేస్తారు.సింహాలు మాత్రం వాళ్ళ వంక గుర్రుగా చూస్తాయి కానీ.వాళ్ళ మీద దాడి చేయవు.వాళ్లు కూడా ఆ సింహాలను ఏమి చేయకుండా అవి చంపిన జంతువును కట్ చేసి, తమకు కావాల్సిన మాంసాన్ని వీపున పెట్టుకుని తీసుకుపోతారు.

అది చూసి సింహాలు వీళ్లెవ్వరురా బాబు మా పొట్ట కొట్టి మరి మా తిండిని లాక్కు పోతున్నారు అనుకుంటూ ఉంటాయి.అయితే సింహాలనే భయపెట్టిన వాళ్ళు ఎవరు అని అనుకుంటున్నారా.

వాళ్లు ఆఫ్రికా దేశంలోని కెన్యాలో ఉండే డోరోబో తెగ వాళ్లు.

వీళ్లకు వేటే ప్రధాన వృత్తి.అలా అని జంతువుల వెంట పరుగులు పెట్టడం, వేటాడి చంపడం లాంటివి వీళ్లు చేయరు.వేరే జంతువులు వేటాడిన జంతువులను సైలెంట్‌ గా వచ్చి దాని మాంసం పట్టుకు పోతారు.

మరి సింహాలు వాళ్ళను చూసి ఎందుకు బయపడుతున్నాయంటే వీళ్లు కనుక బాణం వేస్తే అవి గురితప్పవు.సింహం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్లను చేరలేదు.ఎందుకంటే అవి చేరేలోపే వరుసగా బాణాలు దిగిపోతాయి కనుక.అందుకే వీరిని చూసి సింహాలు బయపడతాయి.

ఈ తెగల్లో మొత్తంగా 17 రకాలున్నాయి.అందరూ కూడా చక్కటి సహకారంతో ఒకే మాట మీద ఉంటూ.

, ఒకే భాష మాట్లాడతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube