ప్రజల వద్ద ఆయుధాలు వుండాల్సిందే.. బైడెన్ విజ్ఞప్తిని పట్టించుకోని ట్రంప్, గన్ లాబీకే మద్ధతు

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఓ స్కూల్‌లో ఉన్మాది జరిపిన కాల్పుల ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అమెరికాలోని గన్ కల్చర్‌పై మరోసారి చర్చ జరుగుతోంది.

 Donald Trump Rejects Calls For Gun Control In Us, Backs Gun Lobby , President L-TeluguStop.com

ఈ మారణ హోమంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన అధ్యక్షుడు జో బైడెన్.శక్తివంతమైన గన్ లాబీకి చెక్ పెట్టడానికి చట్టసభ సభ్యులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.

దేశంలో ఆయుధాల వినియోగంపై ఆంక్షలు విధించాల్సిన సమయం వచ్చిందని జో బైడెన్ అభిప్రాయపడ్డారు.రక్తపాతాన్ని నిర్మూలించే దృఢ సంకల్పాన్ని మనం ఎందుకు తీసుకోలేకపోతున్నామని.

ఇకనైనా మన ఆవేదనను కార్యరూపంలోకి తీసుకొద్దామని ఆయన పిలుపునిచ్చారు.

మరోవైపు.

అమెరికాలో గన్ కల్చర్‌కు సంబంధించి ఎన్నో సర్వేలు చేదు నిజాలు చెబుతున్నాయి.దేశంలో నిత్యం ఏదో ఒక మూల జరిగే కాల్పుల ఘటనల్లో కనీసం 53 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారట.

అంతేకాదు.అమెరికాలో జరిగే హత్యల్లో 79 శాతం తుపాకీ కాల్పుల ద్వారానే జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

చిన్నారులు బొమ్మ తుపాకీలు కొనుక్కున్నంత తేలిగ్గా అక్కడ గన్‌లు దొరుకుతున్నాయి.

Telugu Gun Lobby, Biden, Donald Trump, Donaldtrump, Gun Control, Lyndon Johnson-

ఇంట్లో గన్ వుండటం స్టేటస్ సింబల్‌గా భావించే మనస్తత్వం అక్కడి ప్రజల్లో వుంది.కానీ ఇదే సమయంలో ఉన్మాదులు పెట్రేగిపోతున్నారు.దేశంలో నేరాలకు ఆయుధాలే అసలు కారణమని 50 ఏళ్ల క్రితమే అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ బైనెస్ జాన్సన్ చెప్పారంటే ఆయన ముందుచూపును అర్ధం చేసుకోవచ్చు.

అప్పట్లోనే అమెరికా ప్రజల వద్ద 9 కోట్లకుపైగా ఆయుధాలున్నాయట.మరి గడిచిన 50 ఏళ్లలో వీటి సంఖ్య ఏ స్థాయిలో పెరిగి వుంటుందో ఊహించడం కూడా కష్టమే.2018 నాటి లెక్కల ప్రకారం అమెరికన్ల వద్ద 39 కోట్ల ఆయుధాలున్నాయని అంచనా.

అయితే ఈ స్థాయిలో మారణహోమం జరుగుతున్నా బైడెన్ పిలుపుపై అమెరికాలో మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి.

తుపాకులు వద్దని ఒక వర్గం అంటుంటే.కావాలని మరో గ్రూప్ కోరుతోంది.

తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం గన్ లాబీకే మద్ధతు పలికారు.దేశంలో తుపాకీ వాడకంపై కఠిన నిబంధనలు వద్దని స్పష్టం చేశారు.

ప్రమాదాల నుంచి తమను తాము రక్షించుకునేలా చట్టానికి లోబడే తుపాకీ వాడకాన్ని అనుమతించాలని ట్రంప్ కోరారు.కానీ మన చిన్నారులను రక్షించుకోవడానికి, పాఠశాలలను పటిష్టం చేసుకోవడానికి అందరం ఏకం కావాలని డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు.

మరి ఆయన వ్యాఖ్యలపై డెమొక్రాట్లు , ప్రజా సంఘాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube