అమెరికా అధ్యక్షుడిగా పదవీ విరమణ చేయగానే ట్రంప్ తీవ్ర అనారోగ్యానికి గురవుతాడా.?? ట్రంప్ కి వింత వ్యాధి వస్తుందా.?? బ్రెయిన్ ట్రామా తో ట్రంప్ మంచానికే పరిమితం అవుతాడా.?? ఈ సందేహాలు ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా తెగ వైరల్ అవుతున్నాయి.అసలు ట్రంప్ కి అలా ఎందుకు అవుతుంది, అమెరికన్స్ అందరూ ఈ విషయాలను నమ్మడానికి గల కారణం ఏమిటి అంటే అందుకు కారణం లేకపోలేదు.అసలు విషయంలోకి వెళ్తే.
భవిష్యత్తు లో ఇలా జరుగుతుంది, భూకంపాలు వస్తాయి, మనుషులు రోగాలతో ఇబ్బందులు పడుతారు అంటూ పలు విషయాలు చెప్పిన మన వీర బ్రహ్మం గారిలానే నోస్త్రాడమాస్ పుస్తకంలో కూడా భవిష్యత్తు గురించి ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయి.నోస్త్రాడమాస్ లో ఉన్న విధంగానే చాలా సంఘటనలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే వీటిని అమెరికన్స్ ఎక్కువగా నమ్ముతారు.ఇదిలాఉంటే 1996 లో మృతి చెందిన ఓ కళ్ళు లేని ముసలి బామ్మ భవిష్యత్తు చెప్పడంతో ఫుల్ ఫేమస్ అయ్యింది.
ఈమె చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి కూడా.

అమెరికాలో 2001 సెప్టెంబర్ నెలలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడులు, సోవియట్ యూనియన్ విచ్చిన్నం, ప్రిన్స్ డయానా మరణం, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విషయాలను ముందుగానే వెల్లడించింది.తదుపరి ఈ సంఘటనలు జరిగిన తరువాత ఆమెపై నమ్మకం ఏర్పడింది.అయితే ఆమె 2021 లో ఏం జరగబోతోంది కూడా ముందుగానే తెలిపింది.
ఆమె లెక్కల ప్రకారం.ఇప్పుడు అధ్యక్షుడిగా పదవి నుంచి వైదొలగనున్న ట్రంప్ కు భవిష్యత్తులో ఆందోళన కరమైన రోగం వస్తుందని, ఈ రోగం రావడం వలన ట్రంప్ కు వినికిడి లోపం కూడా వస్తుందని తెలిపింది.
అంతేకాదు ట్రంప్ ట్రామా రోగం కారణంగా మంచానికే పరిమితం అవుతారని తెలిపింది.ఇదే ఏడాది క్యాన్సర్ కు మందు కూడా కనుగొంటారని పలు విషయాలు తెలిపింది.
ఇంకా పలు సంచలన విషయాలు ఆమె వెల్లడించినా ట్రంప్ విషయం ఒక్కటే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
.