1.నైజీరియాలో మరో కొత్త రకం వైరస్
కరోనా వైరస్ విలయతాండవం తరువాత బ్రిటన్ దక్షిణాఫ్రికాలో రెండు కొత్త రకం వైరస్ లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా నైజీరియాలో మరో రకం కరోనా వైరస్ ను గుర్తించారు.ఇది కరోనా కంటే భిన్నంగా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
2.తెలంగాణలో కరోనా
గడిచిన 24 గంటలు తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 518 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
3. తాడిపత్రి లో 144 సెక్షన్

అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో తాడిపత్రి లో 144 సెక్షన్ విధించారు.
4.30 వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు
నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్దఎత్తున పోరాడుతున్న రైతుల ఆందోళనలు నేటికి 30 రోజుకు చేరాయి.
5.జూమ్ యాప్ లో అదనపు ఫీచర్లు
జూమ్ యాప్ ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.ఈ మెయిల్, క్యాలెండర్ ఫీచర్స్ ను జోడించబోతున్నారు.
6.ఐ – టిడిపి యాప్ ప్రారంభం

నాయకులకు పార్టీ ఛానల్ కు మధ్య వారధిగా ఉండే ఐ – టిడిపి యాప్ ను పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు.
7.నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న కర్ణాటక
కొత్త రకం కరోనా వైరస్ విజృంభణ భయంతో కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎం యడ్యూరప్ప ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఆ నిర్ణయాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు.
8.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటలు దేశవ్యాప్తంగా 23,068 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
9.చెన్నైలో కొత్తరకం కరోనా .ఇసోలేషన్ లో 499 మంది

కొత్తరకం కరోనా వైరస్ చెన్నైలోనూ మొదలైంది.గత రెండు వారాల వ్యవధిలో లండన్ నుంచి విమానాల్లో చెన్నైకి వచ్చిన 499 మందిని హోమ్ ఐసోలేషన్ లో పెట్టి వారిపై నిఘా ఏర్పాటు చేశారు.
10.ఆర్జీయూకేటీ మెరిట్ జాబితా విడుదల
ఏపీ లో ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రిపుల్ ఐటి సీట్లకు మెరిట్ జాబితా విడుదలైంది.గురువారం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ లో ఆర్జీయూకేటీ ఛాన్సలర్ కేసి రెడ్డి విడుదల చేశారు.
11.31 న రజనీ పార్టీ ప్రకటన

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ ఈ నెల 31న చెన్నైలో … జనవరిలో తాను ప్రారంభించబోయే పార్టీ పేరు ప్రకటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
12.అమ్మ ఒడి లబ్ధి పొందిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్
అనంతపురం జిల్లాలో అమ్మ ఒడి ద్వారా లబ్ధి పొందిన ఉపాధ్యాయుడు పై సస్పెన్షన్ వేటు పడింది.బుక్కపట్నం మండలం ఎర్రంపల్లి పాఠశాలలో ఎస్జిటి టీచర్ గా పనిచేస్తున్న సురేష్ బాబు తన కుమారుడికి అమ్మ ఒడి పథకం కింద దరఖాస్తు చేసుకుని 15,000 లబ్ధిపొందారు.
13.పద్మావతి వర్సిటీలో సివిల్స్ శిక్షణ
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం బి.ఎ, ఎం ఎ పబ్లిక్ పాలసీ, ఆంత్రోపాలజీ కోర్సులతోపాటు సివిల్స్ శిక్షణ ఇవ్వనున్నట్లు పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ జనరల్ సెక్రెటరీ వాసిరెడ్డి సురేఖ తెలిపారు.మరిన్ని వివరాలకు 8500218036, 9182009356 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
14.తెరుచుకున్న తెలంగాణ సినిమా థియేటర్లు

కోవిడ్ నిబంధనల కారణంగా గత తొమ్మిది నెలలుగా మూతపడ్డ సినిమా థియేటర్లు నేటి నుంచి తెలంగాణలో తెరుచుకున్నాయి.
15.కోబ్రా సెకండ్ లుక్ విడుదల
విలక్షణ నటుడు నటిస్తున్న కోబ్రా సినిమా కు సంబంధించి సెకండ్ లుక్ ఫోటో ను విడుదల చేశారు.
16.బ్రిటన్ లో ఆరు లక్షల మందికి కరోనా వాక్సిన్

అమెరికా కు చెందిన ఔషద దిగ్గజ కంపెనీలు ఫైజర్ , బయో ఎంటెక్ కంపెనీలు అభివృద్ధి చేసిన కరోనా వాక్సిన్ ను ఆరు లక్షల మంది యూకే పౌరులకు వేసినట్టు ఆ దేశ ఆర్థిక శాఖ ప్రకటించింది.
17.తిరుమల లో తెలంగాణ మంత్రులు
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తెలంగాణ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
18.రాజ్ ఠాక్రే కు కోర్ట్ నోటీసులు

తమ కంపెనీ పోస్టర్లను మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కార్యకర్తలు చింపివేశారని అమెజాన్ కంపెనీ కోర్టులో వేసిన పిటిషన్ పై ఆ పార్టీ చీఫ్ రాజ్ ఠాక్రే కు ముంబైలోని అలోకల్ కోర్టు నోటీసులు జారీ చేసింది.
19.26 నుంచి హెల్త్ యునివర్సిటీ తుది కౌన్సిలింగ్
తెలంగాణలోని ప్రవేటు, వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తుది విడత కౌన్సెలింగ్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నెల 26 న వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,710
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 50,950
.