పెళ్లి మండపం అంతా ఇరు కుటుంబాల బంధువులతో కళకళలాడుతోంది.వరుడు కూడా పెళ్లి పీటల పై కూర్చున్నాడు.
ఇలా కార్యక్రమం కొనసాగుతుండగా సినిమాల్లో చూపించే విధంగా కళ్యాణ మండపం లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.అలా వచ్చిన పోలీసులు ఈ పెళ్లి ఆపేయాలని చెప్పగా అక్కడ ఉన్న వారందరూ షాక్ కి గురయ్యారు.
అయితే ఇందుకు కారణం పెళ్ళికొడుకు ఏదో చేసి ఉంటాడని కదా మీ అనుమానం.అయితే మీరు పొరపాటు పడినట్టే.
అసలు విషయం ఏమిటంటే, కొద్ది నిమిషాల్లో పెళ్లి చేసుకోవాల్సిన పెళ్లి కూతురు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని పోలీసులను ఆశ్రయించింది.దీంతో పోలీసులు కళ్యాణ మండపం చేరుకొని ఆ పెళ్ళిని ఆపేశారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం లోని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ వివాహ కార్యక్రమంలో జరిగింది.
మరిపెడ మండలం గుండెపుడికి చెందిన యామిని రాజేష్ కి అలాగే కురవి మండలం పెళ్లికి చెందిన ఓ యువతికి వారి పెద్దల సమక్షంలో వివాహం నిర్ణయించుకుని అన్ని కార్యక్రమాలు ముగించుకుని పెళ్లి పీటల వరకు వచ్చింది.అయితే కార్యక్రమం ఇంతవరకు వచ్చిన తరువాత వధువు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని పోలీసులకు తెలిపింది.
అయితే ఇందుకు కారణం లేకపోలేదు.తాను ఇది వరకే ఒకరిని ప్రేమించానని అతడినే వివాహం చేసుకుంటానని తన తల్లిదండ్రులు నిర్ణయించారని పోలీసులకు ఆవిడ తెలియజేసేందుకు తెలియజేసింది.
దీంతో వెంటనే ఆ ఏరియా
సర్కిల్ ఇన్స్పెక్టర్
పెళ్లి మండపం వద్దకు చేరుకొని పెళ్లిని ఆపేశారు.

ఆ పెళ్ళి తంతు కు వచ్చిన ఎందరో పెళ్లి కుమార్తెకు నచ్చచెప్పాలని ప్రయత్నించిన ఆవిడ ఒప్పుకోకపోవడంతో చివరికి వివాహం నిలిచిపోయింది.పెళ్లి కూతురికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత ఆ యువతిని సఖి కేంద్రానికి తరలించారు.ఈ సంగతి ఇలా ఉండగా కళ్యాణ మండపంలో పెళ్లి తంతు నిలిచిపోవడం తో ఆ పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అవమాన భారం గా చూశారు.
దీంతో వెంటనే అదే మండపంలో పెళ్లి కొడుకు కు మరో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు డిసైడ్ కావడంతో వారి బంధువులలో పెళ్లి కొడుకు వరసైన వారిని చూసి ఆ యువతితో వివాహం జరిపించారు.దీంతో పెళ్లి కొడుకు తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయంతో వారి బంధు మిత్రులు అందరూ ఆశ్చర్యపోయారు.