Aditya Srivastava : సీఐడీ సీరియల్ లో నటించిన అభిజిత్ మీకు గుర్తున్నారా.. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారంటే?

హిందీ సీరియల్ సిఐడి బుల్లితెరపై ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.హిందీలో తెరకెక్కించిన ఈ సీరియల్ ను తెలుగు లోకి కూడా డబ్బింగ్ చేయగా తెలుగులో కూడా ఈ సీరియల్ కి భారీగా రెస్పాన్స్ వచ్చింది.

 Do You Remember Cid Serial Inspector Abhijeet Alias Aditya Srivastava Now He Is-TeluguStop.com
Telugu Abhijeet, Bhakshak, Bhumi Pednekar-Movie

ఇక ఆ సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు దక్కింది.అంతేకాకుండా ఆ సీరియల్లోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది.ఇందులో ఇన్‌స్పెక్టర్ అభిజీత్ కూడా ఒకరు.హీరో రేంజ్ కటౌట్ తన నటనతో బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు.కానీ ఈ సీరియల్ తర్వాత అభిజిత్ మళ్లీ కనిపించలేదు.

Telugu Abhijeet, Bhakshak, Bhumi Pednekar-Movie

చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు భక్షక్ సినిమాలో కీలకపాత్రలో కనిపించాడు.అభిజిత్ ను చూసి ఎమోషనల్ అవుతున్నారు నెటిజన్స్.మళ్లీ ఇంతకాలం తర్వాత చూసినందుకు చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు మళ్ళీ వచ్చాడు అభిజిత్.కాగా అభిజిత్ అసలు పేరు ఆదిత్య శ్రీవాస్తవ( Aditya Srivastava ).అతను బాండిట్ రాజా, గులాల్ వంటి అనేక అవార్డులను అందుకున్నాడు.ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్( Bhumi Pednekar ) దర్శకత్వం వహించిన భక్షక్ చిత్రంలో నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నాడు.

తాజాగా విడుదలైన ట్రైలర్ లో అభిజిత్ కనిపించాడు.ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అభిజిత్ అలియాస్ ఆదిత్య మాట్లాడుతూ.

Telugu Abhijeet, Bhakshak, Bhumi Pednekar-Movie

రెడ్ చిల్లీస్ అధినేత గౌరవ్ తనను ఈ మూవీలో విలన్ పాత్రలో నటించాలని కోరినట్లు తెలిపారు.20 ఏళ్లుగా సీఐడీలో ఉన్న అతన్ని అందరూ చూశారు.బ్లాక్ ఫ్రైడే, గులాల్ వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించాడు.చాలా కాలం పాటు అదే సీరియల్లో నటించిన అతను ఇప్పుడు సరికొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నారట.భక్షక్ స్టోరీ చెప్పగానే వెంటనే ఒప్పుకున్నారట.అయితే ఇన్నాళ్లు బుల్లితెరపై హీరోగా కనిపించిన ఆదిత్య ఇప్పుడు వెండితెరపై ప్రతినాయకుడిగా ఎలా కనిపిస్తాడనేది చూడాలి మరి.కాగా ఈ భక్షక్ చిత్రంలో బ్రజేష్ సింగ్( Brajesh Singh ) పాత్రలో ఆదిత్య కనిపించనున్నాడు.ఇందులో భూమి ఫడ్నేకర్ జర్నలిస్ట్ వైశాలి పాత్రలో నటిస్తుంది.

బీహార్‌లో జరిగిన భయానక సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube