చిరంజీవి - అమల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టిందో తెలుసా!

అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna )గారి సతీమణి అక్కినేని అమల( Amala ) అప్పట్లో తెలుగు మరియు తమిళం భాషల్లో పెద్ద స్టార్ హీరోయిన్ అనే విషయం అందరికీ తెలిసిందే.తమిళం లో రజినీకాంత్ , కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్స్ తో ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

 Do You Know How Much Money This Movie Made In Chiranjeevi Amala Combination In-TeluguStop.com

తెలుగు లో ఆమె అక్కినేని నాగార్జున తో ఎక్కువ సినిమాలు చేసింది.ఆయనతో కాకుండా ఆమె మెగాస్టార్ చిరంజీవి తో మాత్రమే ఒక సినిమా చేసింది.

ఆ చిత్రం పేరు ‘రాజా విక్రమార్క ‘. ( Raja Vikramarka )సోషియో ఫాంటసీ నేపథ్యం లో తెరకెక్కిన ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )కెరీర్ లో పెద్ద ఫ్లాప్ అయ్యింది.

ఆయన ఇమేజి తగిన కథ కాదు కాబట్టి కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు కానీ, చిరంజీవి చిత్రాలలో ఒక మంచి సినిమాగా ఈ చిత్రం నిలిచిపోతుంది అని మాత్రం చెప్పొచ్చు.

Telugu Amala, Chiranjeevi, Raja Vikramarka, Tollywood-Movie

ఈ సినిమా తర్వాత అమల నటనకి టాటా చెప్పేసి అక్కినేని నాగార్జున ని ప్రేమించి పెళ్లాడింది.ఈ చిత్రం లో అమల తో పాటుగా రాధికా శరత్ కుమార్ ( Radikaa Sarathkumar )మరో హీరోయిన్ గా నటించింది.ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఈ చిత్రం లో నటిస్తూనే, సహా నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

ఆరోజుల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి టాక్ పెద్దగా లేకపోయినా కూడా ఓపెనింగ్స్ అదిరిపోయాయి.మెగాస్టార్ ని తొలిసారి ఇలాంటి జానర్ చిత్రం లో చూడడం, అది కూడా ఆయన వరుసగా ఇండస్ట్రీ హిట్స్ తో టాలీవుడ్ ని షేక్ చేస్తున్న రోజుల్లో రావడం వల్ల ఈ సినిమాకి ఆ స్థాయి ఓపెనింగ్స్ దక్కాయి.

అప్పట్లో ఈ చిత్రం దాదాపుగా ఆరు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకుంది.ఆరోజుల్లో అంత బిజినెస్ అనేది సాధారణమైన విషయం కాదు.

Telugu Amala, Chiranjeevi, Raja Vikramarka, Tollywood-Movie

అలా అత్యధిక ప్రింట్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రానికి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.ఆరోజుల్లో ఫ్లాప్ టాక్ తో ఈ స్థాయి వసూళ్లు రావడం అనేది మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ని నిదర్శనం అని చెప్పొచ్చు.అప్పట్లో నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు ఆయన తోటి స్టార్ హీరోల హిట్ సినిమాల షేర్ వసూళ్లతో సమానం అన్నమాట.అయితే ఈ సినిమా ఫెయిల్యూర్ అవ్వడం తో చిరంజీవి మళ్ళీ అలాంటి జానర్ సినిమాల వైపు కనెత్తి కూడా చూడలేదు.

కమర్షియల్ చిత్రాలకే ఆయన ఎక్కువ ప్రాధాన్యత చూపించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube