ఈ ఏడాది సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటి తమిళ హీరో విజయ్( Thalapathy Vijay ) నటించిన ‘లియో’( Leo movie ) భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది కానీ.విజయ్ క్రేజ్ మరియు కాంబినేషన్ హైప్ వల్ల ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.
తమిళం తో పాటుగా తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషలకు కలిపి ఈ చిత్రానికి 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
డివైడ్ టాక్ తో ఈ స్థాయి వసూళ్లు రావడం అనేది సాధారమైన విషయం కాదు.ఇప్పటికీ కూడా ఈ చిత్రం థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తూనే ఉంది.

అలా విజయవంతంగా నడుస్తున్న ఈ చిత్రాన్ని అగ్రిమెంట్ ప్రకారం రేపు నెట్ ఫ్లిక్స్ లో టెలికాస్ట్ చెయ్యాలి.అభిమానులందరూ ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే తమిళ వెర్షన్ కి సంబంధించి అద్భుతమైన క్వాలిటీ తో ప్రింట్ బయటకి వచ్చేసింది.కానీ ఆడియో పెద్దగా క్లారిటీ లేదు.అంత మంచి క్వాలిటీ ప్రింట్ వచ్చేసింది కాబట్టి ఓటీటీ లో తొందరగా విడుదల చేద్దాం అనుకున్నారు.కానీ ఈ సినిమాకి మరో వీకెండ్ కూడా థియేటర్స్ నుండి రెవిన్యూ వచ్చే అవకాశాలు ఉండడంతో మరో వారం రోజులకు ఓటీటీ( OTT ) విడుదల తేదీ వాయిదా వేయించినట్టు తెలుస్తుంది.
అంటే నవంబర్ 23 వ తారీఖున ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళం భాషల్లో విడుదల కాబోతుంది.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అయితే ఈ సినిమా ఈ వీకెండ్ లో వస్తుంది, ఇంట్లో కూర్చొని సరదాగా ఎంజాయ్ చెయ్యొచ్చు అని అనుకున్న సినీ ప్రియులకు మాత్రం నిరాశని మిగిలించింది.ఓటీటీ లోకి వచ్చినప్పటికీ కూడా థియేటర్స్ లో చూడాలని అనుకున్న వాళ్ళు కచ్చితంగా చూస్తారు, ఆ మాత్రానికి ఓటీటీ విడుదల వాయిదా వెయ్యడం ఎందుకు అని అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.మరికొంత మంది అభిమానులు అయితే థియేట్రికల్ రన్ ఇంకా ఉన్నప్పుడు వారం రోజులు ఓటీటీ వాయిదా వేస్తె మీకొచ్చిన నష్టం ఏమిటి?, కొద్ది రోజులే కదా ఆగండి అని సర్ది చెప్తున్నారు.