చిరంజీవి – అమల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టిందో తెలుసా!

అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna )గారి సతీమణి అక్కినేని అమల( Amala ) అప్పట్లో తెలుగు మరియు తమిళం భాషల్లో పెద్ద స్టార్ హీరోయిన్ అనే విషయం అందరికీ తెలిసిందే.

తమిళం లో రజినీకాంత్ , కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్స్ తో ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

తెలుగు లో ఆమె అక్కినేని నాగార్జున తో ఎక్కువ సినిమాలు చేసింది.ఆయనతో కాకుండా ఆమె మెగాస్టార్ చిరంజీవి తో మాత్రమే ఒక సినిమా చేసింది.

ఆ చిత్రం పేరు 'రాజా విక్రమార్క '.( Raja Vikramarka )సోషియో ఫాంటసీ నేపథ్యం లో తెరకెక్కిన ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )కెరీర్ లో పెద్ద ఫ్లాప్ అయ్యింది.

ఆయన ఇమేజి తగిన కథ కాదు కాబట్టి కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు కానీ, చిరంజీవి చిత్రాలలో ఒక మంచి సినిమాగా ఈ చిత్రం నిలిచిపోతుంది అని మాత్రం చెప్పొచ్చు.

"""/" / ఈ సినిమా తర్వాత అమల నటనకి టాటా చెప్పేసి అక్కినేని నాగార్జున ని ప్రేమించి పెళ్లాడింది.

ఈ చిత్రం లో అమల తో పాటుగా రాధికా శరత్ కుమార్ ( Radikaa Sarathkumar )మరో హీరోయిన్ గా నటించింది.

ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఈ చిత్రం లో నటిస్తూనే, సహా నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

ఆరోజుల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి టాక్ పెద్దగా లేకపోయినా కూడా ఓపెనింగ్స్ అదిరిపోయాయి.

మెగాస్టార్ ని తొలిసారి ఇలాంటి జానర్ చిత్రం లో చూడడం, అది కూడా ఆయన వరుసగా ఇండస్ట్రీ హిట్స్ తో టాలీవుడ్ ని షేక్ చేస్తున్న రోజుల్లో రావడం వల్ల ఈ సినిమాకి ఆ స్థాయి ఓపెనింగ్స్ దక్కాయి.

అప్పట్లో ఈ చిత్రం దాదాపుగా ఆరు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకుంది.

ఆరోజుల్లో అంత బిజినెస్ అనేది సాధారణమైన విషయం కాదు. """/" / అలా అత్యధిక ప్రింట్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రానికి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.

ఆరోజుల్లో ఫ్లాప్ టాక్ తో ఈ స్థాయి వసూళ్లు రావడం అనేది మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ని నిదర్శనం అని చెప్పొచ్చు.

అప్పట్లో నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు ఆయన తోటి స్టార్ హీరోల హిట్ సినిమాల షేర్ వసూళ్లతో సమానం అన్నమాట.

అయితే ఈ సినిమా ఫెయిల్యూర్ అవ్వడం తో చిరంజీవి మళ్ళీ అలాంటి జానర్ సినిమాల వైపు కనెత్తి కూడా చూడలేదు.

కమర్షియల్ చిత్రాలకే ఆయన ఎక్కువ ప్రాధాన్యత చూపించాడు.

ఆ రెండు ఏరియాలలో పుష్ప2 మూవీకి షాకిచ్చిన కేజీఎఫ్2.. అసలేం జరిగిందంటే?