ప్రజలను పట్టించుకోని సీఎం అవసరమా.?: మోదీ

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణకు చేసిందేమీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.తుఫ్రాన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.

 Do We Need A Cm Who Does Not Care About People?: Modi-TeluguStop.com

బీజేపీతోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని మోదీ తెలిపారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనన్న ఆయన కేసీఆర్ రెండు చోట్ల ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు.

గజ్వేల్ లో ఈటల చేతిలో ఓడిపోతామన్న భయంతోనే కామారెడ్డికి వెళ్లారని విమర్శించారు.కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని పేర్కొన్నారు.

దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు.అంతేకాకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.

రైతులకు నీళ్లు ఇస్తామని ఇవ్వలేదన్న మోదీ ప్రజలను పట్టించుకోని ముఖ్యమంత్రి మనకు అవసరమా అని ప్రశ్నించారు.సచివాలయానికి వెళ్లని సీఎం అవసరమా అని నిలదీశారు.

తెలంగాణకు ఇలాంటి సీఎం అవసరం లేదని చెప్పారు.బీజేపీ మాత్రమే ప్రజలకు న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube