జేబులో టీ తాగడానికి కూడా ఒక్క రూపాయి లేదు.కానీ గుండెల నిండా ధైర్యం ఉంది.
దర్శకుడు కావాలని దృఢ సంకల్పం ఉంది.అలాంటి ఒక మహా సంకల్పం ముందు ఎన్ని కష్టాలు వచ్చినా, ఏమీ లేకపోయినా సరే అని ఉన్నట్టే ఉంటుంది.
అదే మరి సంకల్పం యొక్క మహిమ.ఓ రోజు రౌడీయిజం అనే సినిమాకి షూటింగ్ జరుగుతోంది.
ఆ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న దర్శకుడికి తర్వాత సీన్ కు సంబంధించిన కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడు సదరు వ్యక్తి .దాంతో ఆ సినిమా దర్శకుడు పూర్తిగా ఇంప్రెస్ అయిపోయాడు.ఒక్క నిమిషం ఆలోచించకుండానే నాతో కలిసి పని చెయ్ అంటూ అవకాశం కూడా వచ్చాడు, సరిగ్గా ఆలా అన్న పది రోజులకే ఆ సినిమా షూటింగ్ పలు కారణాలవల్ల ఆగిపోయింది.
కానీ అప్పటికే విషయం చేరాల్సిన వారికి చేరిపోయింది.
రాంగోపాల్ వర్మ కి పొట్ట చేత పట్టుకొని వచ్చిన ఈ వ్యక్తి గురించి తెలిసింది.అప్పట్లో రాంగోపాల్ వర్మ క్రేజ్ ఎలా ఉండేది అంటే బాలీవుడ్ వారైనా కూడా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి.
అలాంటి సమయంలో రాంగోపాల్ వర్మ తన దగ్గర పని చేయడానికి ఈ వ్యక్తిని పిలిపించుకున్నాడు.అతడు మరెవరో కాదు దర్శకుడు శోభన్.
రాంగోపాల్ వర్మ తీసిన అనగనగా ఒక రోజు సినిమా కోసం వర్మ దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశాడు శోభన్.ఆ తర్వాత ప్రేమ కథ సినిమాకి కూడా అక్కడే ఉన్నాడు.
వర్మ స్కూల్లో మంచి కాంటాక్ట్స్ వచ్చాయి.దాంతో కృష్ణవంశీ తీసిన సింధూరం సినిమా కోసం మాటలు రచయితగా కూడా మారాడు.
ఆ తర్వాత ఆ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన మురారి సినిమా టైం లో మహేష్ బాబు తో జరిగిన పరిచయం అతని జీవితాన్ని మలుపు తిప్పింది.శోభన్ యొక్క వ్యక్తిత్వం, చేస్తున్న పనితీరు వచ్చి బాబీ సినిమాకు దర్శకత్వం చేయాలని కోరాడు మహేష్.కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది.ఆ తర్వాత నిర్మాత అయిన ఎమ్మెస్ రాజు , శోభన్ ని పిలిచి మరి ఒక అవకాశం ఇచ్చాడు.ప్రభాస్, త్రిష కాంబినేషన్ లో వర్షం సినిమాకి దర్శకత్వం వహించాడు.ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టు కొట్టడమే కాదు.
ప్రభాస్ ని స్టార్ హీరోగా కూడా నిలబెట్టింది.
ఆ తర్వాత రవితేజ చార్మి లతో కలిపి చంటి అనే మరో సినిమా తీయగా అది మాత్రం ఫ్లాప్ అయింది.ఇక అదే టైంలో భూమికతో సినిమా చేయడానికి అంతా సిద్ధం చేసుకుని కథ వినిపించి, ఒప్పించి మరి ఇంటికి వచ్చాడు.కాని ఆరోజే గుండెపోటుతో మరణించాడు.
సరిగ్గా ఇది జరిగిన వారానికి అతడి అన్న కమీడియన్ లక్ష్మీపతి సైతం గుండెపోటుతో మరణించాడు.ఇద్దరు అన్నదమ్ములు ఇండస్ట్రీ ని వదిలి వెళ్ళిపోయారు.
ఇక శోభన్ కొడుకు సంతోష్ శోభన్.ఈ మధ్యకాలంలో సంతోష్ శోభన్ సినిమాలు బాగానే కనిపిస్తున్నాయి.
మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరోగా సంతోష్ కి పేరు ఉంది.పేపర్ బాయ్ సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది.
ఏక్ మినీ కథ సంతోష్ కి మంచి పేరు తీసుకొచ్చింది.మంచి రోజులు వచ్చాయి సినిమాలో కూడా సంతోష్ చాలా బాగా నటించాడు.
ఇక ఇప్పుడిప్పుడే నటుడుగా ఎదుగుతున్న సంతోష్ మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుందాం.