ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి గందరగోళ్ళం వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే.అధికారంలో ఉన్న వైసీపీ మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో ఏపీ రాజధాని విషయం సందిగ్ధత నెలకొంది.
అమరావతియే ఏకైక రాజధానిగా ఉంచాలని వైసీపీ మినహా మిగతా పార్టీలు తెలియజేస్తున్నాయి.ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఏపీలో భారత్ జోడో యాత్రలో అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉంచాలని అన్నారు.
అంతేకాకుండా వైసీపీ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పు పట్టడం జరిగింది.ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి… సీఎం జగన్ పై మండిపడ్డారు.
రాయలసీమకు సీఎం జగన్ తీరని అన్యాయం చేశారని విమర్శల వర్షం కురిపించారు.రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తే ఎక్కువగా నష్టపోయేది రాయలసీమ వాసులేనని అన్నారు.
విభజన చట్టం ప్రకారం రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రకు కేంద్ర ప్రభుత్వం బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇవ్వాల్సి ఉండగా వైసీపీ తెప్పించుకోలేకపోయిందని తులసి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.







