ఆ ఆవేదన ఊహించలేకపోతున్నా.. చిన్నారి అత్యాచార ఘటన పై శేఖర్ కమ్ముల ఎమోషనల్?

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏరియాలో ఉన్నటువంటి డీఏవీ పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల బాలికపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ఈ ఘటన పై ఎంతో మంది తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

 Director Sekhar Kammula Emotional Post On Dav School Incident Details, Shekhar K-TeluguStop.com

ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆ స్కూల్‌ గుర్తింపును రద్దు చేసింది.ఈ క్రమంలోనే పోలీసులు ప్రిన్సిపాల్ తో పాటు కారు డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

వీరి పై ఇప్పటికే పలు సెక్షన్ల పై కేసును నమోదు చేశారు.

తాజాగా ఈ ఘటన పై ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పందించారు.

ఈ క్రమంలోనే చిన్నారిపై అత్యాచార ఘటన గురించి శేఖర్ కమ్ముల సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేస్తూ నగరంలోని డీఏవీ పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల బాలికపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడటం నిజంగా ఘోరమైన ఘటన ఇలాంటి నిస్సహాయక స్థితిలో ఏం చేయాలో తోచడం లేదు.

ఆవేదనతో ఆ చిన్నారి పడే బాధను ఊహించుకోలేకపోతున్నాం.

ధైర్య సాహసాలతో ఆ తల్లిదండ్రులు చేస్తున్న పోరాటానికి జోహార్లు అంటూ ఈ సందర్భంగా ఈ ఘటనపై శేఖర్ కమ్ముల స్పందించారు.అదేవిధంగాపిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు ఏమాత్రం రాజి పడకూడదు.ప్రస్తుతం ఉన్న ఈ ఆధునిక కాలంలోపిల్లల భద్రతకు సంబంధించిన అనుకూల వాతావరణాన్ని కల్పించాలి పిల్లల భద్రత విషయంలో రాజీ పడితే భయంకరమైన సమాజాన్ని మనమే రూపొందించిన వారు అవుతాము అంటూ ఈ సందర్భంగా ఈ ఘటనపై శేఖర్ కమ్ముల ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube