ఆ ఆవేదన ఊహించలేకపోతున్నా.. చిన్నారి అత్యాచార ఘటన పై శేఖర్ కమ్ముల ఎమోషనల్?

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏరియాలో ఉన్నటువంటి డీఏవీ పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల బాలికపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

 ఈ క్రమంలోనే ఈ ఘటన పై ఎంతో మంది తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆ స్కూల్‌ గుర్తింపును రద్దు చేసింది.ఈ క్రమంలోనే పోలీసులు ప్రిన్సిపాల్ తో పాటు కారు డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

వీరి పై ఇప్పటికే పలు సెక్షన్ల పై కేసును నమోదు చేశారు.తాజాగా ఈ ఘటన పై ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పందించారు.

ఈ క్రమంలోనే చిన్నారిపై అత్యాచార ఘటన గురించి శేఖర్ కమ్ముల సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేస్తూ నగరంలోని డీఏవీ పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల బాలికపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడటం నిజంగా ఘోరమైన ఘటన ఇలాంటి నిస్సహాయక స్థితిలో ఏం చేయాలో తోచడం లేదు.

ఆవేదనతో ఆ చిన్నారి పడే బాధను ఊహించుకోలేకపోతున్నాం. """/"/ ధైర్య సాహసాలతో ఆ తల్లిదండ్రులు చేస్తున్న పోరాటానికి జోహార్లు అంటూ ఈ సందర్భంగా ఈ ఘటనపై శేఖర్ కమ్ముల స్పందించారు.

అదేవిధంగాపిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు ఏమాత్రం రాజి పడకూడదు.ప్రస్తుతం ఉన్న ఈ ఆధునిక కాలంలోపిల్లల భద్రతకు సంబంధించిన అనుకూల వాతావరణాన్ని కల్పించాలి పిల్లల భద్రత విషయంలో రాజీ పడితే భయంకరమైన సమాజాన్ని మనమే రూపొందించిన వారు అవుతాము అంటూ ఈ సందర్భంగా ఈ ఘటనపై శేఖర్ కమ్ముల ఎమోషనల్ పోస్ట్ చేశారు.

జయం మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ హీరో నిఖిల్ కాదు.. మరి ఎవరో తెలుసా ?