మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' షూటింగ్ లో నటుడిగా అడుగుపెట్టిన స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం ‘గాడ్ ఫాదర్’ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో ప్రస్తుతం హైదరాబాద్‌ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.ఈ రోజు ‘గాడ్ ఫాదర్’ షూటింగ్‌ లో పూరీ జగన్నాథ్ జాయిన్ అయ్యారు.

 Director Puri Jagannath In Chiranjeevi God Father Shooting Details, Director Pur-TeluguStop.com

‘గాడ్ ఫాదర్’ సెట్స్ లో నటుడి గా అడుగుపెట్టిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, పూరీ జగన్నాథ్ కి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.”నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు, వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని, హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు.

ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.

కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా.అందుకే .మా పూరీ జగన్నాథ్ ని ‘గాడ్ ఫాదర్’ లో ఓ ప్రత్యేకమైన పాత్రలో పరిచయం చేస్తున్నాం” అని ట్విట్టర్ వేదికగా ట్వీట్ కూడా చేశారు మెగాస్టార్ చిరంజీవి.

ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్న ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ దుస్తుల్లో కనిపిస్తుండగా పూరి జగన్నాధ్ బ్లాక్ టీషర్టు ధరించి కళ్ళజోడుతో కనిపించారు.

తన ఆల్ టైమ్ ఫేవరెట్ మెగాస్టార్ చిరంజీవితో కలసి వెండితెరపై సందడి చేసే అవకాశం రావడడంతో పూరి జగన్నాధ్ కల నిజమైయింది.

Telugu Chiranjeevi, Mohan Raja, Puri Jagannath, God, Nayanthara, Satya Dev, Tham

స్టార్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రంలో యువ హీరో సత్యదేవ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.టాప్ టెక్నికల్‌ టీమ్‌ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.వెటరన్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తుండగా, సంగీత సంచలనం ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు.

అనేక బాలీవుడ్ హిట్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన సురేష్ సెల్వరాజన్ ఈ చిత్రానికి ఆర్ట్‌వర్క్‌ అందిస్తున్నారు.

ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు.

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా,

నిర్మాతలు: ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్,

సమర్పణ: కొణిదెల సురేఖ,

బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్,

సంగీతం: ఎస్ ఎస్ థమన్,

డీవోపీ: నీరవ్ షా,

ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాజన్,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు,

పీఆర్వో: వంశీ-శేఖర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube