పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన లక్ష్ చదలవాడ 'ధీర'

వరుస సినిమాలకు కమిటవుతూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు యంగ్ హీరో లక్ష్ చదలవాడ.‘వలయం’ సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్న ఆయన.త్వరలోనే ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ క్రమంలోనే మరో ప్రాజెక్టు ఓకే చేసి ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చాడు.‘ధీర’ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను నేడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.తొలి సన్నివేశానికి ఖ్యాతి చదలవాడ క్లాప్ ఇవ్వగా.

 Laksh Chadalavada’s “dheera” Launched, Regular Shoot Commenced , Dheera ,-TeluguStop.com

చదలవాడ శ్రీనివాస రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.ఈ నెల 14వ తేదీ వరకు హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరగనుంది.

విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సరికొత్త కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు.శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 12గా ఈ సినిమా నిర్మిస్తున్నారు.

పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ సినిమాకు బాణీలు కడుతున్నారు.ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ హంగులతో ఈ సినిమా నిర్మాణం పూర్తి చేయనున్నారట మేకర్స్.

విలక్షణ కథలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్న హీరో లక్ష ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కడం ఖాయమని చిత్రయూనిట్ చెబుతోంది.నేటితరం కోరుకునే అన్ని అంశాలు జోడించి ఈ సినిమా రూపొందిస్తున్నట్లు తెలిపారు.అలాగే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.

నటీనటులు :

లక్ష్ చదలవాడ

సాంకేతిక నిపుణులు :

సమర్పణ : చదలవాడ బ్రదర్స్, బ్యానర్ : శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్, నిర్మాత : పద్మావతి చదలవాడ, దర్శకుడు : విక్రాంత్ శ్రీనివాస్సంగీతం: సాయి కార్తీక్, సినిమాటోగ్రఫీ : కన్నా పీసీ, డైలాగ్స్: విక్రాంత్ శ్రీనివాస్, శృతిక్, ఎడిటర్: మధు రెడ్డి, ఫైట్ మాస్టర్ : జాషువా, పీఆర్వో : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube