డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన సినిమా పొన్నియిన్ సెల్వన్. ఇక ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాల, ప్రభు, ఆర్.
శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్, రెహమాన్, ఆర్.పార్తిబన్ తదితరులు నటించారు.ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ను అందించాడు.మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థపై మణిరత్నం, శుభస్కరన్ అల్లి రాజా ఈ సినిమాకు నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.
రవివర్మన్ సినిమాటోగ్రఫీని అందించాడు.ఈ సినిమా తమిళం తో పాటు హిందీ, కన్నడ, తెలుగు, మలయాళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఇక భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
ఇందులో విక్రమ్ ఆదిత్య కరికాలన్ గా, ఐశ్వర్యరాయ్ నందినిగా, త్రిష కుందవై పిరిత్తియార్ పాత్రలో కనిపించారు.ఇక పరాంతక చోళుడు కు కుందవై, ఆదిత్య కరికాలన్, అరుల్ మొలి వర్మన్ అనే ముగ్గురు సంతానం ఉన్నారు.
ఇక ఆదిత్య రాజు అవ్వటంతో బంగారు భవనాన్ని నిర్మించుకుంటాడు.దీంతో తన తండ్రి పరాంతక చోళుడును తన దగ్గర ఉంచుకోవడానికి వందియతేవన్ ద్వారా తన తండ్రికి కబురు పంపిస్తాడు.
ఇక వందియతేవన్ వెళ్తుండగా మధ్యలో కదంపూర్ అనే భవనంలో విశ్రాంతి తీసుకుంటాడు.అక్కడ వందియతేవన్ చోళ రాజ కోశాధికారి పలువెట్టయ్య నేతృత్వంలో కరికాలనుకు వ్యతిరేకంగా చేసిన కుట్ర గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటాడు.
ఇక చివరికి కొడుకు రమ్మన్నాడు అన్న విషయాన్ని పరాంతక చోళుడికి చెబుతాడు.ఆ తర్వాత అరుల్ ను కూడా తీసుకొని రమ్మని కుందావై వందియతేవన్ ను శ్రీలంకకు పంపిస్తుంది.

ఇక అరుల్ మొలివర్మన్ ను బందీగా తీసుకురావాలి అని పలువెట్టరైయార్ శ్రీలంకకు రెండు ఓడలను పంపిస్తాడు.దీంతో అరుల్ ను తీసుకొని వస్తుండగా తుఫాను వల్ల ఓడలు చిక్కుకుంటాయి.ఇక ఆ సమయంలో ఒక జాలరి కాపాడుతుంది.ఇక అరుల్ అనారోగ్యం పాలవటంతో చికిత్స కోసం బౌద్ధ మందిరానికి తీసుకెళ్తారు.ఆ సమయంలో ఆదిత్యను సింహాసనం నుంచి తప్పించి తన పినతండ్రి మధురాంతకన్‌ను గద్దె ఎక్కించాలనే పలువెట్టయార్ కుట్రలు ఆ సమయంలో అక్కడ జోరుగా ఉంటాయి.ఇక ఈ కుట్రలో పలువెట్టయార్ భార్య నందిని కూడా ఉంటుంది.
ఇక ఆదిత్య కరికలన్‌ను కదంబూర్ అనే ప్రాంతంలోని ఒక భవనంలోకి పిలిపించి ఆదిత్యను హత్య చేస్తారు.కానీ ఈ హత్య నేరం వందియతేవన్‌పై పడుతుంది.
ఆ తర్వాత తనపై పడిన నింద నుంచి వందియతేవన్ ఎలా బయటకువచ్చాడు.పలువెట్టయార్ ఏమయ్యాడనేది.
వందియతేవన్, కుందవై మధ్య ప్రేమకథ ఏమైంది అనేది మిగిలిన కథలోని చూడవచ్చు.

నటినటుల నటన:
నటీనటుల గురించి ఎంత చెప్పినా తక్కువే.కీలక పాత్రలో నటించిన విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, కార్తీ, త్రిష లు మాత్రం తమ పాత్రలను మర్చిపోలేకుండా చేశారు.నిజానికి తమ పాత్రలలో లీనమయ్యారు.ఇక మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్:
సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం ప్రేక్షకుల ముందుకు అద్భుతమైన కథను తీసుకొని వచ్చాడు.ముఖ్యంగా పెద్దపెద్ద స్టార్ లను ఈ సినిమాకు పరిచయం చేశారు.ఎక్కడ కూడా తగ్గకుండా చూపించాడు మణిరత్నం.ఇక ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.రవివర్మన్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగా ఆకట్టుకుంది.

విశ్లేషణ:
ఇక ఈ సినిమా 10వ శతాబ్దపు చోళ రాజులకు సంబంధించిన కథ ఆధారంగా తీసుకొచ్చాడు డైరెక్టర్.ఇక ఈ సినిమాను ఎక్కడ కూడా బోరింగ్ కొట్టకుండా చూపించాడు.స్ట్రాంగ్ నటీనటులతో స్ట్రాంగ్ పాత్రలు చూపించడంతో సినిమా బాగా హైలైట్ అయింది.
ప్లస్ పాయింట్స్:
స్ట్రాంగ్ పాత్రలు, నటీనటులు, కొన్ని సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి.భారీ యాక్షన్ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి.మ్యూజిక్ అద్భుతంగా ఉంది.
మైనస్ పాయింట్స్:
కొన్ని సన్నివేశాలు సాగదీసిన్నట్లు అనిపించింది.
బాటమ్ లైన్:
చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా ఖచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.