2008 డీఎస్సీ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

ఉమ్మడి ఏపీలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం జరిగిన 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం లభించింది.14 ఏళ్ల నిరీక్షణ తర్వాత డీఎస్సీ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.నోటిఫికేషన్ లో భర్తీ చేయకుండా ఉన్న 1,815 పోస్టులను మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.

 2008 Telangana High Court's Key Judgment In The Case Of Dsc-TeluguStop.com

ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 30 వేల టీచర్స్ పోస్టుల భర్తీకి 2008లో నోటిఫికేషన్ విడుదలైంది.

అనంతరం 30 శాతం పోస్టులను డీఈడీ అభ్యర్థులకు రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది.ఈ క్రమంలో ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీఈడీ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది.

ఈ నేపథ్యంలో భర్తీ చేయకుండా ఉన్న ఉద్యోగాలను 2008 డీఎస్సీ రాసిన వారిలో మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా భర్తీ చేయాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఆదేశించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube