ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ వైసీపీలో పెద్ద ప్రక్షాళనకు అపార్టీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) శ్రీకారం చుట్టారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే నియోజకవర్గ ఇన్చార్జిల్లాలను మారుస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఈ మార్పు చేర్పుల్లో పార్టీకి చెందిన కీలక నేతలు ఎంతోమందిని జగన్ పక్కన పెడుతున్నారు.వారిలో అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేస్తూ, తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని సెంటిమెంటు తో కొడుతున్నారు.
సర్వే నివేదికల ఆధారంగానే ఈ మార్పుచేర్పులకు శ్రీకారం చుట్టాలని, ఎవరిపైన తనకు వ్యతిరేకత లేదని, సిట్టింగ్ ఎమ్మెల్యేలను నియోజకవర్గ ఇన్చార్జిలను మార్చినా భవిష్యత్తులో వారి సేవలను ఉపయోగించి వారికి కీలక పదవులు అప్పగిస్తామని , ప్రస్తుతానికి తన తాపత్రయాన్ని అర్థం చేసుకోవాలని జగన్ కోరుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల పైన సర్వే చేయించుకున్న జగన్ ఆ సర్వే ఫలితాలకు అనుగుణంగానే ఈ భారీ మార్కులకు శ్రీకరం చుట్టారు.అయితే జగన్ ఇంత సాహసానికి దిగడానికి గల కారణాలపై ఆ పార్టీ నాయకులు, రాజకీయ వర్గాల లోనూ ఆసక్తి పెరుగుతోంది.అయితే జగన్ జనం నాడి జగన్ పసిగట్టారు అని, అందుకే జగన్ ఈ సాహసానికి దిగినట్టుగా అర్థం అవుతోంది.
వైసిపి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు అందించేందుకు వాలంటరీ వ్యవస్థ( AP Volunteer System )ను జగన్ ఏర్పాటు చేయడం, ప్రజా ప్రతినిధుల సిఫార్సులు అవసరం లేకుండానే అన్ని ప్రభుత్వ పథకాలు ప్రజల గుమ్మం వద్దకు అందుతూ ఉండడం తో , ఎమ్మెల్యే లు ఎవరు అనేది జనాలు పట్టించుకోవడంలేదని, తనను చూసే జనాలు ఓట్లు వేస్తారని జగన్ ఒక అంచనాకు వచ్చేసారు .
అయినా ప్రజలు వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారు, సర్వేలు కచ్చితంగా ఓటమి చెందుతారని తేలితే పార్టీ కీలక నాయకులు అయినా, జగన్ పట్టించుకోవడం లేదు.దీనికి తోడు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం గతం కంటే బలహీనమైందని, అందుకే జనసేన( Janasena )ను కలుపుకు వెళ్లిందని , అయినా ఈ రెండు పార్టీలు కలిసిన తమ విజయాన్ని అడ్డుకోలేవు అని , తాను అమలు చేసిన సంక్షేమ పథకాలే వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయనే నమ్మకంతో ఉన్నారు వైసిపి అధినేత.