ప్రెండ్‌షిప్ మించిన బాండింగ్ ఎక్కడా ఉండదు.చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన స్నేహితులు ఒక్కసారిగా విడిపోతే ఎలా ఉంటుంది.
కొద్ది రోజులపాటు ఏదో కోల్పోయాం అనే ఫీలింగ్ వస్తుంది.ఒకవేళ ఫ్రెండ్‌కి దూరమైనా ఎప్పుడూ వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ తో దగ్గరగా ఉంటాము.
దూరమైనా ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు.చదువు కోసం దేశాలు దాటే స్నేహితులు ఉంటారు.
చాలా ఏళ్ల తర్వాత వాళ్ల తిరిగి కలిస్తే ఎంత హంగామా ఉంటుంది.విదేశాలకు వెళ్లిన స్నేహితుడిని ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకున్నప్పుడు అప్పుడు వీరిద్దరి మధ్య ఉండే క్షణాలు మరింత అమూల్యం.
అలా ఓ ఎయిర్‌పోర్టులో కలుసుకున్న ఇద్దరు స్నేహితులు.వారు చేసిన హంగామా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లండన్ హెథ్రో ఎయిర్‌పోర్ట్ లో తీసిన ఈ వీడియో ట్విట్టర్‌లో షేర్ అయింది.ఈ వీడియోలో ఓ వ్యక్తి తన ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుంటాడు.ఫ్రెండ్‌ను చూడగానే రెయిలింగ్స్ క్రాస్ చేసి ఎయిర్ పోర్టు ఎరైవల్ గేటు వద్దు వెళ్తాడు.అప్పుడు పంజాబీ సాంగ్‌కు ఇద్దరూ సంతోషంగా భాంగ్రా డ్యాన్స్ చేస్తారు.చివరిలో ఒకరినొకరు హత్తుకున్నారు.హెథ్రో ఎయిర్ పోర్టులో అద్భుతంగా స్వాగతం పలికిన వాటిలో ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టి దానికి ఇలా క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోను 20 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.భారీ సంఖ్యలో నెటిజన్లు ఈ వీడియోకు రియాక్ట్ అయ్యారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫ్రెండ్‌షిప్‌కు ఉండే బాండింగ్ ఇదేనని, వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం ఎంతో గాఢమైందని చెప్పుకొస్తున్నారు.ఈ మేరకు వాళ్ల బెస్ట్ ఫ్రెండ్‌కు ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ షేర్ చేస్తున్నారు.0.29 సెకన్లు ఉన్న ఈ వీడియోకి 21.9కే వ్యూవ్స్ వచ్చాయి.112 రీట్విట్‌లు, 787 లైక్స్ వచ్చాయి.