నిజ జీవితంలో జగన్ బాలయ్యకు అభిమాని అయినా బాలయ్య మాత్రం వైసీపీపై కానీ జగన్ పై కానీ అణువంతైనా అభిమానం చూపరు.ఏపీలో ఎన్ని పథకాలను అమలు చేస్తున్నా వైసీపీపై కొన్ని విషయాలకు సంబంధించి విమర్శలు ఉన్నాయి.
వైసీపీ హయాంలో అభివృద్ధి అస్సలు జరగలేదని బాలయ్య, టీడీపీ నేతలు భావిస్తారు.అయితే వీరసింహారెడ్డి సినిమాలో జగన్ ను టార్గెట్ చేసేలా చాలా డైలాగ్స్ ఉన్నాయి.
ట్రైలర్ లో ఇప్పటికే జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా బాలయ్య చెప్పిన రెండు డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి.అభివృద్ధి గురించి చెబుతూ బాలయ్య చెప్పే డైలాగ్స్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయి.
ప్రజలు అధికారంలో కూర్చోబెట్టిన వాళ్లు వెధవలు అయినా ప్రజల నిర్ణయాన్ని గౌరవించాల్సిందే అని బాలయ్య చెప్పుకొచ్చారు.వైసీపీ ఫ్యాన్స్ కు నచ్చని విధంగా సినిమాలో ఎన్నో పంచ్ లు ఉన్నాయి.
ఏపీ ప్రభుత్వం సరైన సమయంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం గురించి కూడా సినిమాలో సెటైర్లు వేశారు.అయితే ఫస్టాఫ్ వరకు ఉత్సాహంతో చూసిన అభిమానులు సెకండాఫ్ చూసిన తర్వాత మాత్రం నిరాశకు గురయ్యారు.నెక్స్ట్ లెవెల్ లో ఈ సినిమా ఉంటుందని అభిమానులు భావించగా అందుకు భిన్నంగా ఈ సినిమా ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ బాగానే ఉన్నా కొన్ని సందర్భాల్లో విమర్శలు హద్దులు దాటాయేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.సినిమాలో సాంగ్స్ ప్లేస్ మెంట్ బాలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.థమన్ బీజీఎం మాత్రం సినిమాకు ఎంతగానో ప్లస్ అయింది.
సినిమాలో కథ పెద్దగా లేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.