ఈ మధ్య కాలంలో ప్రతి హీరో సినిమా సినిమాకు తమ మార్కెట్ పెరగాలని భావిస్తున్నారు.క్రాక్ సినిమాతో సక్సెస్ సాధించిన రవితేజకు ఈ ఏడాది వరుసగా రెండు షాకులు తగిలాయి.
ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు ఏ రేంజ్ డిజాస్టర్లు అనే సంగతి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.రవితేజ మార్కెట్ ను మించి ఖర్చు చేయడం కూడా ఈ సినిమాల ఫలితాలకు కారణమైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే ధమాకా సినిమాకు సంబంధించి వైరల్ అయిన కలెక్షన్లకు అసలు కలెక్షన్లకు సంబంధం లేదని తెలుస్తోంది.ఈ సినిమాకు 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని ప్రచారం జరుగుతుండగా అసలు కలెక్షన్లు మాత్రం 75 కోట్ల రూపాయల రేంజ్ లో ఉన్నాయని తెలుస్తోంది.
ఈ సినిమాకు 20 నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు యాడ్ చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఈ సినిమా ఒరిజినల్ కలెక్షన్లను చూసి షాకవ్వడం రవితేజ అభిమానుల వంతవుతోంది.అయితే రవితేజ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.వాల్తేరు వీరయ్య మూవీ కూడా సక్సెస్ ను సొంతం చేసుకుంటే మాత్రం మాస్ మహారాజ్ రవితేజ హవా మరికొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుందని చెప్పవచ్చు.
రవితేజ మంచి కథలను ఎంచుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.
కెరీర్ పరంగా పొరపాట్లు జరిగితే రవితేజ కెరీర్ మళ్లీ ప్రమాదంలో పడే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
రవితేజ కొత్త సినిమాల ఫలితాలను బట్టి మాస్ మహారాజా రవితేజ భవిష్యత్తు డిసైడ్ కానుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
రవితేజ రెమ్యునరేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.