ఢిల్లీ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది.రాజధానిలో కొత్త కుంభకోణం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.ప్రభుత్వ పాఠశాల తరగతి గదుల నిర్మాణంలో రూ.1,300 కోట్ల అవినీతి జరిగినట్లు సమాచారం.ఈ క్రమంలో అక్రమాలపై ప్రత్యేక సంస్థతో దర్యాప్తు జరిపించాలని విజిలెన్స్ డైరెక్టరేట్ సిఫార్సు చేస్తుంది.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజిలెన్స్ డైరెక్టరేట్ నివేదిక అందజేసింది.ఢిల్లీ సర్కార్ చేపట్టిన 2,400 తరగతి గదుల నిర్మాణంలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.కాగా 2020 ఫిబ్రవరిలోనే ప్రభుత్వానికి విజిలెన్స్ డైరెక్టరేట్ తెలిపింది.
గవర్నర్ జోక్యంతో రెండున్నరేళ్ల తర్వాత కుంభకోణం వెలుగులోకి వచ్చింది.