టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ ఎంపీ కేశినేని నిరసనకు దిగారు.ఈ మేరకు విజయవాడలో పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఈ క్రమంలోనే కేశినేని నాని కార్యాలయం వద్ద నల్లజెండాలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజని పేర్కొన్నారు.
రాష్ట్రం కోసం, ప్రజల కోసం చంద్రబాబు అహర్నిశలు కష్టపడ్డారని తెలిపారు.మచ్చ లేని వ్యక్తి చంద్రబాబు అన్న ఎంపీ కేశినేని నాని ఆయన అరెస్ట్ అక్రమమని వెల్లడించారు.
పోలీసులు కనీసం ప్రొసీడింగ్స్ కూడా ఫాలో కాలేదని మండిపడ్డారు.ఐపీఎస్, ఐఏఎస్ పోస్టింగుల కోసం పోలీసులు ఇలా చేస్తున్నారన్న ఆయన ప్రభుత్వం కక్ష సాధింపు కేసులు తప్ప ఏమీ లేదన్నారు.
అయితే చంద్రబాబు క్లీన్ చిట్ తో తిరగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.