ఢిల్లీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ భేటీ

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక భేటీ నిర్వహిస్తుంది.ఈ మేరకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం అయింది.

 Cwc Meeting At Aicc Headquarters In Delhi-TeluguStop.com

ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ భేటీ జరుగుతోంది.ఈ సమావేశంలో ప్రధానంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు.

అదేవిధంగా కుల గణన, మహిళా రిజర్వేషన్లు, ఇండియా కూటమిలో సీట్ల పంపకాలపై కూడా చర్చించనున్నారని తెలుస్తోంది.అలాగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా ఈ సీడబ్ల్యూసీ మీటింగ్ కు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్ హాజరు అయ్యారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube