మోడీపై నేను చేసిన వ్యాఖ్యలు పబ్లిక్ అనుకునేవే దానిపై చర్చకు సిద్ధం - సీపీఐ నారాయణ

విజయవాడ: సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ కామెంట్స్.నా పైన హనుమాన్ చౌదరి క్రిమినల్ ప్రొసీడింగ్ చేపడతామన్నారు,దాన్ని స్వాగతిస్తున్న.

 Cpi National Secretary Narayana Socking Comments On Narendra Modi Details, Cpi N-TeluguStop.com

మోడీ పై నేను చేసిన వ్యాఖ్యలు పబ్లిక్ అనుకునేవే దానిపై చర్చకు సిద్ధం.అల్లూరి సీతారామరాజు జయంతి రోజు ప్రధాని గిరిజనులపై పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేశారు.

నేటికి గిరిజనులపై కార్పొరేట్ సంస్థలు అడవుల్ని ఆక్రమించుకోవాలని దాడులు చేస్తున్నారు.సుమారు 3 లక్షల మంది గిరిజనులు రాష్ట్రంలో అడవుల్ని ఆధారం చేసుకుని జీవుస్తున్నారు.

సహజ వనరుల కోసం అడవుల్ని కార్పొరేట్ సంస్థలు నాశనం చేయాలని చూస్తున్నారు.గుజరాత్ అల్లర్ల గురించి ప్రపంచానికి తెలుసు, సుప్రీం కోర్ట్ ఆ కేస్ కొట్టివేస్తూ న్యాయమూర్తి పరిధి దాటి వ్యాఖ్యలు చేశారు.

న్యాయమూర్తి వ్యాఖ్యలు ఆధారం చేసుకుని అమిత్ షా పీటీషనర్ ని అరెస్ట్ చేయమని చెప్పడం దారుణం.

పీటీషనర్ పై అలాంటి వ్యాఖ్యలు చేయడం పౌర హక్కులను కాలరాయడమే.

అక్కడ అలా చేస్తూ ఇక్కడికి వచ్చి గిరిజనులపై ప్రేమ ఒలకబోయడం ఖచ్చితంగా రాజకీయ లబ్ది కోసమే.దేశం ఉన్నది ఫెడరల్ వ్యవస్థ,రాష్ట్రాలకు ఉండే హక్కులు రాష్ట్రాలకు ఉన్నాయి.

మహారాష్ట్ర సహా 9 రాష్ట్రాల్లో భాజపా ఓడిపోయినా ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతీస్తూ ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు.ఫెడరల్ వ్యవస్థ ను మోడీ దెబ్బ తీస్తున్నారు,ఇప్పుడు భాజపా కన్ను ఢిల్లీ, తెలంగాణపై పడింది.

భాజపా ,వైకాపా బంధం చాలా అన్యోన్యంగా ,తల వంచి మెడ వంచి జపం చేస్తున్నారు.హోదా, పోలవరం,నిధులు ఏమయ్యాయి,ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలి కదా.

మోడీ భయపడి,గజగజ వానికి రాష్ట్ర ప్రజల గౌరవాన్ని తాకట్టు పెట్టారు.రక్తసిక్త హస్తాలతో రాష్ట్రాలను నాశనం చేస్తూ మోడీ ,అమిత్ షా, రాష్ట్రానికి వస్తే వారిని చూసి వణికిపోతున్నారు.

నేటి వరకు మోడీ 24 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారు,ఇంకో 100 అమ్మకానికి సిద్ధమయ్యారు.గుజరాత్ వాళ్ళకే అన్ని అమ్ముతున్నారు,డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిపోయేవాళ్ళు గుజరాత్ వాళ్లే.

కేసీఆర్ ఎదురు తిరిగినా, జగన్ మాత్రం ఏమి మాట్లాడరు, తీర ప్రాంతం అంతా గుజరాత్ వాళ్ళకే రాసిస్తున్నారు.బొగ్గు కొనుగోలు పై కేసీఆర్ ఎదురు తిరిగారు,ఆదాని దగ్గర కొనను అని చెప్పారు.

భాజపా వ్యతిరేక శక్తులన్ని కలిసి పోరాడాలి.జులై 13 నుంచి 17 వరకు జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తాం.

Telugu Cmjagan, Cm Kcr, Cpi Yana, Cpinational, Cpi Ramakrishna, Modi Bhimavaram,

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కామెంట్స్.వైకాపా ఎంపీ శ్రీధర్ ను అభినందిస్తున్న, వైకాపా భాజపా బంధం గురించి చెప్పినందుకు.రాష్ట్రానికి నిధులు ఇస్తున్నారని చెప్పారు ఏమిచ్చారో చెప్పాలి.ప్రతి బిల్లుకు వైకాపా ఎంపీలు భాజపా కు మద్దతిచ్చామని చెప్పారు.రాష్ట్రానికి హోదా ,విభజన హామీలు ఏమిచ్చారో,స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తామంటే ఏమి మాట్లాడలేదు.పెళ్లి కాకుండా సహజీవనం చేస్తున్నారు,పైన షరతుతో భాజపా ప్రభుత్వం లో చేరతామంటున్నారు.

నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తున్నామని చెప్తూ, పాఠశాలను మూసివేస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డు ఎక్కే పరిస్థితికి తెచ్చారు.

ఇంగ్లీష్ మీడియం అని చెప్తూ విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారు.ఉపాధ్యాయులను నియమించాల్సి వస్తుందని పాఠశాలలు మూసివేస్తున్నారు.

సాక్షి పత్రికని ప్రభుత్వం విలీనం చేసుకోవాలి,అదెలాగు వైకాపాకు ఫామ్ప్లేట్ అయిపోయింది.ప్రకటనలు ఒక్క సాక్షికి మరి కొన్ని పత్రికలకు తప్ప మరో పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం లేదు.

ప్రభుత్వ సొమ్ము ఏమన్నా మీకు రాసిచ్చారా.దీనిపై ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేసైనా చర్యలు తీసుకునేల కార్యాచరణ చేపడతాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube