కరోనా
ధాటికి అగ్రరాజ్యం
అమెరికా
విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే.రానున్న రెండు వారాల్లో కోవిడ్ 19 మరణాల్లో, కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో వివిధ దేశాల నుంచి విద్య, ఉపాధి కోసం అమెరికాకు వెళ్లిన వారి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి.ఇందులో
భారతీయులు
కూడా ఉండటంతో మనదేశంలోని కుటుంబసభ్యులకు కంటిమీద కునుకు ఉండటం లేదు.
ఈ క్రమంలో భారతీయులను ఆదుకునేందుకు అమెరికాలోని భారతీయ సమాజం రంగంలోకి దిగింది.
అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో 1,40,000 మంది అమెరికన్లకు కరోనా సోకగా, 2,475 మంది ప్రాణాలు కోల్పోయారు.
అటు భారత్‌లోనూ కేసుల సంఖ్య 1,000 దాటగా, 27 మంది మరణించారు.ఈ నేపథ్యంలో రెండు దేశాల్లో కరోనా బాధితులకు సాయం చేసేందుకు గాను భారతీయ అమెరికన్ ఎన్జీవో
SEWA International
ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి పిలుపునిచ్చి ఇప్పటి వరకు 2,50,000 డాలర్లకు పైగా వసూలు చేసింది.
ఈ నిధులను వ్యక్తిగత రక్షణ పరికరాలు,
ఫేస్ మాస్క్
లు, సర్జికల్ మాస్క్‌లను కొనుగోలు చేసేందుకు ఉపయోగిస్తోంది.అమెరికాలో కరోనాకు కేంద్ర బిందువుగా ఉన్న న్యూయార్క్ నగరంలోని భారతీయులు, అమెరికన్లు చికిత్స పొందుతున్న ఆసుపత్రులకు ఈ సంస్థ విరాళాలు అందజేస్తోంది.
అలాగే 500 మంది వాలంటర్ల బృందాన్ని రంగంలోకి దించి కరోనా సోకిన వారిని ఆదుకోవడంతో పాటు వ్యాధికి సంబంధించిన సలహాలు, సూచనలు అందించేందుకు హెల్ప్‌లైన్ నిర్వహిస్తోంది.ఇప్పటి వరకు 300 కుటుంబాలకు పైగా వాలంటీర్లు ఏర్పాటు చేశారని.దీనితో పాటు కరోనాతో పోరాడుతున్న వారి కుటుంబాలకు రోజువారీ సరకులు, ఫేస్ మాస్కులు అందిస్తున్నట్లు
సేవా ఇంటర్నేషనల్
ప్రెసిడెంట్ ఎన్ శ్రీనాథ్ అన్నారు.అలాగే కరోనాపై పోరాటం, సాయం చేసేందుకు గాను సుమారు 1,000 స్వచ్ఛంద సంస్థలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
అమెరికాలో మాస్క్‌ల కొరత రాకుండా ఉండేందుకు గాను సంస్థకు చెందిన 43 ఛాప్టర్లలో వాలంటీర్ల చేత వీటిని తయారు చేయిస్తున్నట్లు శ్రీనాథ్ స్పష్టం చేశారు.ఈ బృందాలు వారానికి 2,500 గా ఉన్న మాస్క్‌ల ఉత్పత్తిని 10,000కు పెంచుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

కాగా
కోవిడ్ 19
పై పోరులో భారత ప్రభుత్వానికి సాయం చేసేందుకు గాను న్యూయార్క్‌కు చెందిన హోటల్ యజమాని కెకె.చంద్రమెహతా ఆదివారం
పీఎం కేర్
కు రూ.కోటి విరాళం ప్రకటించారు.అలాగే మెహతా దంపతులు తమ సొంత రాష్ట్రమైన రాజస్థాన్‌లోని అధికారులు, పోలీసులు, మీడియా సిబ్బంది కోసం మరో రూ.11 లక్షలు విరాళంగా ప్రకటించారు.ఫ్లోరిడాకు చెందిన చంద్రకాంత్ పటేల్ తన సొంత రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని 300 కుటుంబాలకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.వీరితో పాటు మరికొందరు భారతీయ అమెరికన్లు రెండు దేశాల్లోని ప్రజల కోసం కోట్లాది రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నారు.
జాన్స్ హాప్కిన్స్ కరోనా వైరస్ రిసోర్స్ సెంటర్
లెక్కల ప్రకారం.ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 32,000 మంది కోవిడ్ 19 కారణంగా మరణించగా.6,84,652 మందికి వైరస్ సోకింది.