తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఈడీ విచారణ ముగిసింది.నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా ఆయనను అధికారులు దాదాపు రెండున్నర గంటల పాటు విచారించారని సమాచారం.
ఇందులో భాగంగా అంజన్ కుమార్ యాదవ్ స్టేట్ మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేశారు.కాగా నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో భాగంగా ఈడీ అధికారులు ఇప్పటికే రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించిన విషయం తెలిసిందే.