భారతీయ జంటను హత్య చేసిన కేసులో దోషిగా తేలిన పాక్ జాతీయుడు మరణశిక్షను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.వివరాల్లోకి వెళితే.
వ్యాపారవేత్త హిరేన్ అధియా, అతని భార్య విధిని నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న 28 ఏళ్ల పాక్ జాతీయుడు హత్య చేశాడు.ఈ కేసులో దోషిగా తేలిన అనంతరం నిందితుడికి దుబాయ్ క్రిమినల్ కోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో మరణశిక్ష విధించింది.
హిరేన్ దంపతులను తాను ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని అందువల్ల మరణశిక్షను ఎత్తివేయాలని నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌ను దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ తిరస్కరించినట్లు ది నేషనల్ నివేదించింది.అయితే ఎమిరేట్స్ అత్యున్నత న్యాయస్థానమైన కోర్ట్ ఆఫ్ సెసేషన్ ఆమోదముద్ర వేసే వరకు పాక్ పౌరుడికి మరణశిక్ష అమలు జరగదు.
ఈ కేసుకు సంబంధించి మరో విచారణ జరుగుతుందా లేదా అన్న దానిపై పేపర్ నివేదించలేదు.ప్రాథమిక విచారణ సమయంలో .లోపల లైట్లు స్విచ్ ఆఫ్ చేయబడినప్పుడు … అన్‌లాక్ చేయబడినప్పుడు డాబా తలుపు ద్వారా దొంగచాటుగా ప్రవేశించే ముందు.నిందితుడు ఇంటి లోపలే వున్నట్లు కోర్టు విన్నది.
ఘటన జరిగిన రోజున నిందితుడు 2,000 దిర్హామ్‌ల విలువైన వాలెట్‌ని దొంగిలించి, అనంతరం మరిన్ని విలువైన వస్తువులు దొరుకుతాయేమోనన్న ఉద్దేశంతో హిరేన్ దంపతుల బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు.
అలికిడికి హిరేన్ నిద్రలేచి చూసేసరికి అప్పటికే భార్యపై దాడి చేసిన నిందితుడు అతనిని కూడా కత్తితో పొడిచి చంపేశాడు.ఫోరెన్సిక్ నివేదికల ప్రకారం.హిరేన్ తల, ఛాతీ, పొత్తి కడుపు, ఎడమ భుజంపై పది కత్తిపోట్లు వున్నాయి.
హిరేన్ భార్య తల, మెడ, ఛాతీ, ముఖం, చెవి, కుడిచేయిపై 14 కత్తిపోట్లు వున్నాయి.ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడిన హిరేన్ పెద్ద కుమార్తె దుబాయ్ పోలీసులకు కాల్ చేయగలిగింది.
రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటలు గడిచేలోగా నిందితుడిని అరెస్ట్ చేశారు.