విజయవాడ: సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.దేశానికి గర్వకారణమైన జి 20కి మోడీ ఛైర్మన్.
ప్రపంచ వ్యాప్తంగా గొప్ప సమావేశం లో 20దేశాల ప్రతినిధులు వస్తున్నారు.సమావేశాలకి కమలం గుర్తు తరహాలో లోగో పెట్టడం సరి కాదు.
ఇక్కడ కూడా మీ పార్టీ గుర్తు పోలిన విధంగా పెట్టడం మంచిది కాదు.వెంటనే ఆ లోగోను మార్చాలని డిమాండ్ చేస్తున్నాం.
మహిళా బిల్లు ఇరవై యేళ్లుగా పెండింగ్‌లో ఉంది.బిజెపి కి పూర్తి మెజారిటీ ఉన్నందున బిల్లు ఆమోదించాలి.
జి 20కి నాయకత్వం వహిస్తున్న మోడీ బిల్లు ఆమోదిస్తే మనకి గౌరవం దక్కుతుంది.
జి 20సమావేశాలకు ముందే మహిళా బిల్లును ఆమోదించాలి.
ఇతర పార్టీ నేతల పై ఒత్తిడి తెచ్చేలా సిబిఐ, ఈడిలను మోడీ ప్రభుత్వం వినియోగిస్తుంది.ఎమ్మెల్యే లను కొనుగోలు చేయడానికి డబ్బు, పదవుల ను ఎరగా చూపుతున్నారు.
తెలంగాణ లో టి.ఆర్‌యస్ నాయకుల పై దాడులు రాజకీయ కోణంలో చేసేవే.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఢీ కొట్టుకుంటున్నాయి.మధ్య లో అధికారులు ఒత్తిడి భరించలేక ఇబ్బందులు పడుతున్నారు.ప్రభుత్వాలు అనుసరించే విధానాలపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకోవాలి.
ఉన్నత స్థాయి విచారణ వేసి వాస్తవాలు తెలుసుకోవాలని మా విజ్ఞప్తి.
లేదంటే ఈ అరాచకాలు మరింత పెరిగి పోతాయి.గవర్నర్ వ్యవస్థ ను కూడా స్వార్ధం కోసం వాడుతున్నారు.
తమిళనాడు, తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్ లో పరిస్థితి చూశాం.గవర్నర్ వ్యవస్థ ను పూర్తి గా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
డిసెంబరు మొదటి వారంలో దీని దేశ వ్యాప్తంగా కార్యక్రమం చేపడతాం.సుప్రీంకోర్టు లో కూడా EWS పైభిన్నమైన తీర్పు రావడం వింతగా ఉంది.