లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్( Congress ) సమీక్ష నిర్వహించింది.ఈ మేరకు ఢిల్లీలోని అశోక్ హోటల్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, గౌరవ గొగోయ్( Mallikarjuna Kharge, Sonia Gandhi, Rahul Gandhi, Priyanka Gandhi, KC Venugopal, Gaurav Gogoi ) సహా సీడబ్ల్యూసీ సభ్యులు హాజరయ్యారు.ఈ సమావేశంలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని తీర్మానించే అవకాశం ఉందని తెలుస్తోంది.
సాయంత్రం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది.ఈ భేటీలో కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతను కాంగ్రెస్ ఎంపీలు ఎన్నుకోనున్నారు.
ఈ క్రమంలోనే పార్టీ ఎంపీలకు రాత్రి రాహుల్ గాంధీ విందు ఇవ్వనున్నారు.