Mallu Bhatti Vikramarka : కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వం..: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు( Telangana assembly meetings ) కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా మొదటిసారి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.

 Mallu Bhatti Vikramarka : కాంగ్రెస్ ప్రజల ప్ర�-TeluguStop.com

తమది ప్రజల ప్రభుత్వమన్న భట్టి నిస్సహాయులకు సాయం చేయడమే తమ విధానమని తెలిపారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ఆరు గ్యారెంటీలను ప్రకటించామన్నారు.

గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రంలో కష్టాలు వచ్చాయని ఆరోపించారు.ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు.అయితే బీఆర్ఎస్( BRS ) పాలనలో మోసపోయామని గ్రహించిన ప్రజలు తమ హామీలనే నమ్మారని పేర్కొన్నారు.

మెరుగైన పాలన అందించడమే తమ లక్ష్యమని భట్టి విక్రమార్క( Mallu Bhatti Vikramarka ) స్పష్టం చేశారు.గతంలో షెడ్యూల్ కులాలు, తెగలకు బడ్జెట్ లో పెట్టిన నిధులు ఖర్చు చేయలేదన్నారు.మహిళలకు రూ.7,848 కోట్లు పెట్టి… రూ.2,665 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube